ఈ పండు వేసవి దాహార్తిని తీర్చడమే కాదు క్రమం తప్పకుండా తింటే.. బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది
పుచ్చకాయ అన్ని సీజన్స్ లో దొరికినా వేసవి కాలం వస్తే చాలు దాహార్తిని తీర్చుకోవడానికి ఎక్కువగా పుచ్చకాయ వైపే అందరి చూపు. బి విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయలో ఎలక్ట్రోలైట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు క్యాన్సర్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఫలితంగా వచ్చే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ (కణాలను నాశనం చేసే క్రియాశీల అణువులు) తొలగించడంలో సహాయపడతాయి. ఫలితంగా పుచ్చకాయ వివిధ క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.