
మధుమేహం నయం చేయలేని ఒక వ్యాధి కానీ నియంత్రించవచ్చు. రక్తంలో చక్కెరను నియంత్రించడానికి శరీరంలో సరైన మొత్తంలో విటమిన్లు ఉండటం చాలా ముఖ్యం. ఆహారంలో చేర్చవలసిన విటమిన్లు ఏమిటో.. ఆ వివరాలు ఆరోగ్య నిపుణుల మాటల్లో మీకోసం..

ఆహారంలో సిట్రస్ పండ్లు, క్యాప్సికమ్, బ్రోకలీ, టమోటాలు తప్పక చేర్చుకోవాలి. వీటిల్లో విటమిన్ సి అదికంగా ఉంటుంది. ఈ విటమిన్ చక్కెర నియంత్రణలో సహాయపడుతుంది. విటమిన్ సి ఒక యాంటీ ఆక్సిడెంట్. విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.

విటమిన్ డి తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలంటే విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు విటమిన్ డిని అధికమొత్తంలో తీసుకోవాలి. విటమిన్ డి.. నారింజ, సాల్మన్, ట్యూనాలలొ ఎక్కువగా ఉంటుంది.

డయాబెటిక్ రోగులకు విటమిన్ బి12 చాలా ముఖ్యమైన విటమిన్. మధుమేహం ఉన్నవారు విటమిన్ బి12 తీసుకోవాలి. మటన్, చేపలు, గుడ్లు, పాలు వంటి ఇతర పాల ఉత్పత్తులను తినొచ్చు. ఈ ఆహారాలలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.

డయాబెటిస్ ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని విటమిన్లు కలిగిన ఆహారాలు తినాలి. అలాంటి విటమిన్‌లలో విటమిన్ ఇ చాలా ముఖ్యమైనది. టమిన్ ఇ లోపాన్ని భర్తీ చేయడానికి, రక్తంలో చక్కెరను నియంత్రించడానికి.. ఆహారంలో పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, సోయాబీన్ నూనె, వేరుశెనగ, బచ్చలికూర, రెడ్ క్యాప్సికమ్ వంటి ఆహారాలను తప్పక చేర్చుకోవాలి.