
సాధారణంగా ప్రజలందరిలోకెల్లా కవలలు ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తుంటారు. ఎందుకంటే కవలలు కనిపించడం చాలా అరుదైన దృశ్యం. అయితే, ఆ గ్రామంలో మాత్రం ప్రతి మూడవ ఇంట్లో కవలలు ఉన్నారు. ఆ గ్రామం ఒక ద్వీపంలో ఉంది.

అవును, మీరు చదివింది నిజమే, ఫిలిప్పీన్స్ (అలబాట్) ద్వీపంలో ఉన్న గ్రామం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రామం చేపలు పట్టడానికి, ప్రకృతి సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. మరో ప్రత్యేకత కూడా దీని సొంతం. అదే కవల పిల్లలు.

ఇంగ్లీష్ వెబ్‌సైట్ ది సన్ ప్రకారం.. ఈ గ్రామంలో 15,000 మంది జనాభా నివసిస్తోంది. అయితే, అందులో దాదాపు 100 జతల కవలలు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ గ్రామంలో చాలా మంది కవలలు నివసిస్తున్నారని ఎవరికీ తెలియదు.

అయితే ఇక్కడి ప్రజలందరికీ కవలలు ఎలా పుడతారో తెలుసుకోవడానికి ఇక్కడ శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు. స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం.. ఇక్కడి మహిళలు సంతానోత్పత్తిని పెంచడానికి ప్రత్యేక ఔషధాలను ఉపయోగించారట. ఆ తర్వాత 1996 నుండి 2006 వరకు 35 సంవత్సరాల మహిళల్లో బహుళ గర్భాలు 182 శాతం పెరిగాయట.