Costly Mask: మాస్కులందూ ఈ మాస్కులు వేరయా.. వీటి ధర తెలిస్తే దిమ్మదిరిగి పోవాల్సిందే..

|

Apr 11, 2021 | 12:35 PM

Costly Mask: కరోనాను మన దరి చేరకుండా చేసే ఏకైక అస్త్రం మాస్క్‌. కాబట్టి ప్రస్తుత రోజుల్లో మాస్కు ధరించడం తప్పనిసరిగా మారింది. అయితే సాధారణంగా మాస్కులు రూ. వందో, రెండు వందలో ఉంటాయి. అలాకాకుండా ఒక్క మాస్కు ధర రూ. లక్షల్లో పలికితే.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఈ స్టోరీ చదివితే...

1 / 6
 ఒకప్పుడు మాస్కులను ధరించే వారికి వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు మాస్కులు లేని వారిని వింతగా చూసే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం అందరి జీవితాల్లో మాస్కు ఒక తప్పనిసరి వస్తువుగా మారిపోయింది.

2 / 6
అయితే అందరూ ఉపయోగించే మాస్కులను తాము ఉపయోగిస్తే ఏం బాగుంటదునుకునే వారికి మార్కెట్లో అత్యంత ఖరీదైన మాస్కులు అందుబాటులో ఉన్నాయి. ఖరీదు అంటే అలాంటిలాంటి ఖరీదు కాదు.. ఏకంగా లక్షల రూపాయలు పలికేవి. అలాంటి కాస్లీ మాస్కులపై ఓ లుక్కేయండి.

3 / 6
వైవెల్‌ మాస్క్‌: ప్రపంచంలో అత్యంత ఖరీదైన మాస్కుల్లో వైవెల్‌ కంపెనీకి చెందిన మాస్కు ముందు వరుసలో ఉంటుంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ కంపెనీ మాస్క్‌ తయారీలో వజ్రాలను పొందుపరచడం విశేషం. దీని ధర 1.5 మిలియన్‌ డాలర్లు.. మన కరెన్సీలో చెప్పాలంటే అక్షరాల.. రూ.11,20,87,500.

4 / 6
 క్రిస్టల్‌ మాస్క్‌: పూర్తిగా రాళ్లతో రూపొందించిన ఈ మాస్కులు ఇటీవల మార్కెట్లో తెగ సందడి చేస్తున్నాయి. ఈ మాస్కులు కేవలం రక్షణ ఇవ్వడమే కాకుండా అందాన్ని కూడా అందిస్తు్న్నాయి. ఇలాంటి మాస్కులు రూ.80 వేల నుంచి అందుబాటులో ఉన్నాయి.

5 / 6
 డైమండ్స్‌కు ఫేమస్‌ అయిన సూరత్‌కు చెందిన ఓ ఆభరణాల దుకాణం ఈ మాస్కును ప్రత్యేకంగా తయారు చేసింది.  పూర్తిగా వజ్రాలతో తయార చేసిన ఈ మాస్కు ధర రూ. 1.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు ఉంటుంది.

6 / 6
పుణేకు చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన బంగారు మాస్క్‌ అప్పట్లో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పూర్తిగా బంగారంతో తయారు చేసిన ఈ మాస్కు తయారీకి రూ.2.90 లక్షలు ఖర్చయ్యింది.