
ఈ ప్రపంచంలో మనకీ తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాగే, వింతలు కుడా ఉన్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేయగానే రక రకాల వీడియోలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్నింటిని చూసినప్పుడు షాక్ అవ్వకుండా ఉండలేము. అలాంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఒకటి ఉంది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం..

నార్వేలోని లాంగ్యార్‌బైన్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత చల్లని ప్రదేశం. ఇక్కడ ఉండే మంచుకు అందరూ గడ్డ కట్టుకుపోతారు. అయినా కూడా ట్రావెల్ ప్రియులు అక్కడికి టికెట్స్ బుక్ చేసుకుని మరి వెళ్తారు. ఇది చూడదగ్గ ప్రదేశం కూడా.

మరి ఇంత చల్లటి ప్రదేశంలో కూడా ఒక వింత చట్టం అమలులో ఉంది. అది తెలుసుకున్న తర్వాత వామ్మో అలా ఎలా చేస్తారు బాబోయ్ అని అనకుండా ఉండలేరు. లాంగ్‌ఇయర్‌బైన్‌లో చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు అక్కడ నిర్వహించ కూడదు. ఎవరూ చనిపోయినా కూడా ఇదే రూల్ వర్తిస్తుంది.

ఎందుకంటే అక్కడ ఉండే మంచు చనిపోయిన మృతదేహాలను కుళ్ళిపోకుండా చేస్తుంది. దీని వలన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ ప్రదేశంలో ఉండే స్మశానవాటికను చివరి సారిగా 1950 లో మూసివేశారు. అయితే, ఇలా చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంది.

ఇక్కడ ఉండే ప్రధాన సమస్య ఏంటంటే మంచులో తవ్వి శవాన్ని పాతి పెట్టడం చాలా కష్టమైన పని. కష్ట పడి అదంతా చేసినా కూడా అవి ఎప్పటికీ కుళ్లిపోకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మాంసం కూడా అలాగే ఉండిపోతోంది. దీంతో ఇలాంటి కఠినమైన చట్టం పెట్టాల్సి వచ్చింది.