విదేశాలకు వెళ్లాలంటే వీసా కావాలి. అదే విధంగా భారతదేశంలో కూడాకొన్ని ప్రదేశాల్లోకి వెళ్లాలంటే.. అనుమతి కావాలి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అనుమతి లేకుండా ప్రయాణించలేరు. భారతదేశంలోని ఈ ప్రదేశాలకు వెళ్లడానికి అవసరమైన ఈ అనుమతిని ఇన్నర్ లైన్ పర్మిషన్ అంటారు. సమాచారం ప్రకారం, అంతర్జాతీయ సరిహద్దు ఈ ప్రదేశాల గుండా వెళుతుంది. కనుక ఈ ప్రదేశాలను సందర్శించాలంటే అనుమతి తీసుకోవాలి.
నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న లడఖ్‌లోని కొన్ని ప్రదేశాలను సందర్శించడానికి మీరు అనుమతిని పొందాలి. ఈ ప్రదేశాలలో నుబ్రా వ్యాలీ, త్సో మురారి సరస్సు, ఖర్దుంగ్ లా పాస్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలను సందర్శించాలంటే.. అనుమతి తప్పనిసరి.. అంతేకాదు ఈ అనుమతి ఒక రోజు మాత్రమే చెల్లుతుంది.
ఈశాన్య భారత దేశంలో నాగాలాండ్ పర్యాటకులను ఆకర్షించే ప్రాంతం. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు నాగాలాండ్‌ను సందర్శిస్తారు. అయితే నాగాలాండ్‌లోని కోహిమా, మోకోక్‌చుంగ్, వోఖా, దిమాపూర్, మోన్, కిఫిరే మొదలైన ప్రదేశాలను సందర్శించాలంటే పర్యాటకులకు అనుమతి అవసరం. ఇక్కడ 5 రోజుల పర్మిట్ కు రూ.50 లు చెల్లించాల్సి ఉంటుంది. 30 రోజుల వరకు పర్మిట్ రూ.100కి లభిస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న అనేక ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ అనుమతి తప్పనిసరి. ఈ ప్రదేశాలలో ఇటానగర్, తవాంగ్, రోయింగ్, పాసిఘాట్, భాలుక్‌పాంగ్, బోమ్‌డిలా, జిరో మొదలైనవి ఉన్నాయి. భూటాన్, మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ రాష్ట్రం భద్రతా కోణం దృష్ట్యా చాలా సున్నితమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.
సిక్కింలోని త్సోంగ్మో సరస్సు, గోయిచ్లా ట్రాక్, నాథులా, యుమ్తంగ్, గురుడోంగ్మార్ సరస్సు వంటి అద్భుతమైన అందమైన ప్రదేశాలున్నాయి. వీటిని అనుమతి లేకుండా సందర్శించలేరు. ఈ ఆసక్తికరమైన ప్రదేశాలను సందర్శించడానికి.. మీరు ఇన్నర్ లైన్ అనుమతిని పొందాలి.