uppula Raju |
Sep 17, 2021 | 10:34 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు వినాయకచవితిని జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు.
గణపతికి ఉండ్రాళ్లంటే ఇష్టమని అందరికి తెలుసు. అందుకే అతడికి అందరు ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతారు. అయితే ముంబైలో వినాయకుడికి గోల్డెన్ ఉండ్రాళ్లు సమర్పిస్తుండటం విశేషం.
ఈ ప్రత్యేక ఉండ్రాళ్ల ధర కిలోకు 12 వేల రూపాయలు. వీటిని నాసిక్ నగరంలోని ఓ దుకాణంలో అమ్ముతున్నారు.
ఈ షాప్‌లో బంగారు, వెండి, జీడిపప్పుతో తయారు చేసిన చాలా రకాల ఉండ్రాళ్లు ఉన్నాయి. అయితే అత్యంత ఖరీదైన ఉండ్రాళ్లు కిలోకు 12 వేల రూపాయలు. అయినప్పటికీ ప్రజలు వీటిని కొనుగోలు చేస్తున్నారు.
వార్తా సంస్థ ANIతో షాప్ యజమాని మాట్లాడుతూ.. ఈ గణేశోత్సవంలో మేము 25 రకాల ఉండ్రాళ్లను సిద్ధం చేశామని తెలిపాడు. వీటికి జనాల నుంచి మంచి స్పందన ఉందన్నాడు.