Viral Photos: భారతదేశంలోనే ఇవి అందమైన గ్రామాలు..! వీటి ప్రత్యేకత ఏంటంటే..?

|

Sep 14, 2021 | 8:10 PM

Viral Photos: భారతదేశంలో చాలా అందమైన గ్రామాలు ఉన్నాయి. ఇవి విదేశీ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తాయి.

1 / 5
 కసౌల్, హిమాచల్ ప్రదేశ్: ఈ గ్రామం భారతదేశంలోని అత్యంత అందమైన గ్రామాలలో ఒకటిగా గుర్తింపు సాధించింది. ఇక్కడ ఏడాది పొడవునా పర్యాటకుల గుంపు ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేవారికి ఈ ప్రదేశం అనువుగా ఉంటుంది.

2 / 5
లాచుంగ్, సిక్కిం: టిబెట్ సరిహద్దు పక్కనే ఉన్న లాచుంగ్ అనే గ్రామం సిక్కింలోని గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఆపిల్, నేరేడు తోటలు ఉంటాయి. సుమారు 8,858 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామం మంచుతో కప్పబడి ఉంటుంది.

3 / 5
ఇడుక్కి, కేరళ: ఈ ప్రదేశం కేరళలోని పశ్చిమ కనుమలలో ఎత్తైన ప్రదేశం. ఈ గ్రామంలో మీరు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అనేక రకాల చెట్లు, మొక్కలను చూడవచ్చు. ఇక్కడి అందమైన సరస్సులు, జలపాతాలు, దట్టమైన అడవులు ఈ గ్రామానికి మరింత అందాన్ని ఇస్తాయి.

4 / 5
మజులి, అస్సాం: బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఇక్కడ నివసించే కొందరు మత్స్యకారులు ఇతర మానవులకన్నా ఎక్కువ కాలం బతుకుతారు.

5 / 5
గోకర్ణ, కర్ణాటక: కర్ణాటకలో ఉన్న ఈ గ్రామం గోవాకు చాలా దగ్గరగా ఉంటుంది. కర్ణాటకను సందర్శించే వారు కచ్చితంగా ఈ గ్రామాన్ని సందర్శిస్తారు.