Pak Miss Universe: వివాదాల్లో పాకిస్థాన్ ఫస్ట్ మిస్ యూనివర్స్ ఎరికా రాబిన్.. ప్రభుత్వం విచారణకు ఆదేశం

|

Sep 17, 2023 | 11:36 AM

అందాల సుందరి పోటీల్లో పాల్గొని ఆ కిరీటాన్ని పొందిన పాకిస్థాన్ యువతి ఇప్పుడు చిక్కుల్లో చిక్కుకుంది. టైటిల్ గెలుచుకున్న ఆ యువతిపై పాకిస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలను జారీ చేసింది. ఆ యువతి పాకిస్థాన్ తొలి మిస్ యూనివర్స్ ఎరికా రాబిన్ ఎందుకు వివాదాల్లో చిక్కుకుందంటే.. 

1 / 6
UAEలో జరిగిన పోటీలో పాకిస్థాన్ లోని కరాచీలో చెందిన ఎరికా రాబిన్  విన్నర్ గా నిలిచింది. అంతేకాదు    పాకిస్థాన్ తొలి మిస్ యూనివర్స్ గా రికార్డ్ సృష్టించింది. అయితే ఈ టైటిల్ గెలిచిన తర్వాత ఆమె వివాదాల్లో చిక్కుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మిస్ యూనివర్స్‌గా ఎరికా ఎంపికపై పాకిస్తాన్ ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తింది. దర్యాప్తుకు ఆదేశించింది. 

2 / 6
వాస్తవానికి ఈ అందాల పోటీని దుబాయ్ కి చెందిన బిజినెస్ గ్రూప్ యూజెన్ పబ్లిషింగ్  అండ్  మార్కెటింగ్ నిర్వహించింది. పాకిస్థాన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే ఈ నిర్వహణపై పాకిస్థాన్  ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ ఈ పోటీల్లో పాకిస్తాన్ పేరును ఉపయోగించి నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తించింది. UAE ప్రభుత్వంతో టచ్‌లో ఉంది.

3 / 6
houseofyugen.com అనే వెబ్‌సైట్ లో పాకిస్తాన్‌కు చెందిన 24-28 సంవత్సరాల వయస్సు గల యువతులు  దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మిస్ యూనివర్స్ పాకిస్థాన్ 2023 ఈ పోటీ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ సంస్థకు వచ్చిన అన్ని దరఖాస్తుల్లో కరాచీకి చెందిన ఎరికా రాబిన్ మిస్ యూనివర్స్ పాకిస్తాన్ 2023 గా ఎంపికైంది.

4 / 6
ఎరికా రాబిన్ వయస్సు 24 సంవత్సరాలు. పాకిస్థాన్‌కు చెందిన మోడల్. ఎరికా 14 సెప్టెంబర్ 1999న పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించింది. ఎరికా క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. 2014లో కరాచీలో పట్టభద్రురాలైంది. 

5 / 6
ప్రదర్శనలో ఎరికా చాలా అందంగా కనిపించింది. మొదటి నుండి ఎరికా ఫ్యాషన్, మోడలింగ్ ప్రపంచంలో కెరీర్ ను ఎంచుకుంది.  ఎరికా 2020 సంవత్సరంలో మోడలింగ్ ప్రపంచంలోకి ప్రవేశించింది. పాకిస్థాన్‌కు చెందిన దివా మ్యాగజైన్‌లో ఎరికాకు చోటు దక్కింది.

6 / 6
మోడలింగ్‌లో చేరడానికి ముందు ఎరికా అసిస్టెంట్ మేనేజర్‌గా కూడా పనిచేసింది. ఎరికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంది. 43 వేల మందికి పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. నవంబర్ 18, 2023న శాన్ సాల్వడార్‌లో జరగనున్న మిస్ యూనివర్స్ 2023 పోటీలో ఎరికా పాకిస్థాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తుంది.