
Dehydration

నీళ్లు అధికంగా తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ తలెత్తుతుంది. ఒళ్లంతా నొప్పులు, కండరాలు పట్టేసినట్లుండటం వంటి లక్షణాలు కూడా శరీరంలో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడం కారణం అయి ఉండొచ్చు. ఇలాంటి సమస్యలున్నవారు తగినన్ని నీళ్లు తాగి చూడండి. తక్షణ ఉపశమనం కనిపిస్తుంది.

డీహైడ్రేషన్ సమస్యను గుర్తించడానికి తలనొప్పి కూడా ఓ సూచనే. ఈ సారి భరించలేని తలనొప్పి వేధిస్తుంటే రెండు గ్లాసుల నీళ్లు తాగితే అదుపులోకి రావొచ్చు.

ఒక్కోసారి మూత్రం రంగు మారుతుంటుంది. అలాంటి సందర్భాల్లో రెండు గంటలకోసారి బార్లీ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. ఇవి శరీరంలో డీహైడ్రేషన్ సమస్యని అదుపులో ఉంచుతాయి.

శరీరంలో నీటి శాతం తగ్గితే భావోద్వేగాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది. మానసిక అలసట, చికాకుగా అనిపిస్తుందట. ఉదయం లేచిన వెంటనే తగినన్ని నీళ్లు తాగితే మీ శరీర జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తున్నారు.