Viral Photos: ఈ చేపకు 3 గుండెలు 8 చేతులు ఉంటాయి..! రక్తం కూడా ఎరుపు రంగులో ఉండదు..
Viral Photos: సాధారణంగా ఈ భూమిపై జన్మించిన జీవుల రక్తం ఎరుపుగా రంగులో ఉంటుంది. అందరికీ ఒకే గుండె ఉంటుంది. కానీ కొన్ని జీవులు
కటిల్ ఫిష్ ప్రత్యేకత ఏమిటంటే వాటి శంఖం బయట కాకుండా శరీరం లోపల ఉంటుంది. తద్వారా ఇది లోతైన సముద్రంలో సులభంగా కదులుతుంది.
Follow us on
సాధారణంగా ఈ భూమిపై జన్మించిన జీవుల రక్తం ఎరుపుగా రంగులో ఉంటుంది. అందరికీ ఒకే గుండె ఉంటుంది. కానీ కొన్ని జీవులు ఉన్నాయి వాటి రక్తం ఎరుపుకు బదులుగా ఇతర రంగులో ఉంటుంది. కానీ ఈ రోజు మనం అలాంటి సముద్ర జీవి గురించి తెలుసుకుందాం.
ఈ చేప పేరు కటిల్ ఫిష్ . దీనిని సీ ఫెని అని కూడా అంటారు. ఈ చేప రక్తం రంగు సాధారణంగా ఎరుపు రంగులో ఉండదు. నీలం లేదా ఆకుపచ్చగా ఉంటుంది. దీనికి కారణం ఇందులో ఉండే ప్రోటీన్.
ఈ జీవి ఊసరవెల్లిలా దాని రంగును మార్చడంలో నేర్పరి. కాబట్టి లోతైన సముద్రంలో దీనిని కనుగొనడం ఒక సవాలు. ఈ చేప శరీరం లోపల ఒకటి కాదు మూడు హృదయాలు ఉంటాయి. ఏదైనా ఇతర జీవి దానిపై దాడి చేసినప్పుడు అది ముదురు రంగులో ఉండే పొగను విడుదల చేస్తుంది.
కటిల్ ఫిష్ ప్రత్యేకత ఏమిటంటే వాటి శంఖం బయట కాకుండా శరీరం లోపల ఉంటుంది. తద్వారా ఇది లోతైన సముద్రంలో సులభంగా కదులుతుంది.
ఈ చేపకు కేవలం మూడు హృదయాలు మాత్రమే కాదు ఆక్టోపస్ లాంటి ఎనిమిది చేతులు కూడా ఉంటాయి. సముద్రంలో వెన్నెముకలు లేని అత్యంత తెలివైన జీవులలో ఇది ఒకటి.