
ఆప్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇవి మానసిక ఉల్లాసాన్ని అందించడమే కాకుండా, మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. అందుకే చాలా మంది ఎక్కువగా ఆప్టికల్ ఇల్యూషన్స్ సాల్వ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ ఆప్టికల్ ఇల్యూషన్స్ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ అదిరిపోయే దాంతో మీ ముందుకు వచ్చాం. కాగా, ఫొటోలో బండ రాళ్లు ఉన్నాయి. వీటి మధ్యలో ఒక పాము కూడా ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెడితే మీరు మంచి మైండ్ పవర్, దృష్టి నైపుణ్యం కలవారు.

చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ పరిష్కరించడానికి ఇష్టపడతారు. అయితే కొన్ని సార్లు కొందరు వీటిని చాలా సులభంగా సాల్వ్ చేస్తే మరికొన్ని ఆప్టికల్ ఇల్యూషన్స్ మాత్రం , సవాలు విసురుతూ, బుర్రలు పట్టుకునేలా చేస్తాయి. అంతే కాకుండా మెదడుకు గట్టి పరీక్ష పెడతాయి. అలాంటి ఆప్టికల్ ఇల్యూషనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫొటోను మొదట చూడగానే చాలా మంది, చాలా సింపుల్‌గా గుర్తిస్తాం అనుకుంటారు. కానీ ఇందులోనే పెద్ద కిటుకు ఉంది. అందమైన అడవి, ప్రశాంతమైన సెలయేరు కనిపిస్తుంది. అంతే కాకుండా నీరుపై నున్నటి రాళ్లు, కొన్ని చోట్ల పెద్ద పెద్దని బండ రాళ్లు కనిపిస్తాయి. అంతేకాకుండా అక్కడక్కడ విరిగిపోయి, ఉన్న చెట్టుకొమ్మలు,కటెలు, చెట్టు వేరు ఇలా చాలా ఉన్నాయి.

అయితే వీటన్నింటి మధ్యనే ఓ పాము దాగి ఉంది. నీటి సెలయేరు, బండ రాళ్ల మధ్య దాగి ఉంది. మరి మీరు దానిని గుర్తించగలరా? ఏమైంది పాము ఎక్కడ ఉంది అంటూ వెతుకుతున్నారా? మొదట చాలా సులభమే అనుకున్నా పామును గుర్తించడానికి ఇంకా సమయం తీసుకుంటున్నారా? అయినా డోంట్ వర్రీ .. మీకు ఆ బండరాళ్లు, సెలయేళ్ల మధ్య పాము ఎక్కడ ఉందో తెలియజేస్తాం.

మీకు పైన ఫొటో కనిపిస్తుందా? దానిని ఒకటికి రెండు సార్లు పరీక్ష పట్టి చూడండి. మీ దృష్టి మొత్తం ఆ ఫొటోపైనే కేంద్రీకరించడం అప్పుడు మీకు అందులో ఉన్న పాము కనిపిస్తుంది. వెతకాల్సిన అవసరం లేదు పైన ఫొటోను చూడండి, అందులో మీకు మార్క్ చేసి కనిపిస్తుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్స్, మైండ్ పవర్‌ను పెంచి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.