
పల్లెటూరి బండ పచ్చి మిర్చి పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: 150 గ్రాముల పచ్చి మిర్చి , మూడు ఉల్లిపాయలు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక టేబుల్ స్పూన్ , ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర , కరివేపాకును తీసుకోవాలి.

పల్లెటూరి బండ పచ్చి మిర్చి పచ్చడి తయారీ విధానం: ముందుగా పచ్చి మిర్చి బాగా వేయించుకోవాలి: ముందుగా పాన్‌లోఆయిల్ వేసి దానిలో పచ్చి మిర్చిలను మీడియం మంటపై బాగా వేయించాలి. వీటిని మరి మాడిపోయే వరకు ఉంచకండి. గోల్డ్ కలర్ రంగులోకి మారగానే పొయ్యి మీద నుంచి కిందకు దించేయండి.

ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి: మూడు ఉల్లిపాయలను తీసుకుని వాటిని బాగా కడిగి కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇంకా అదే పాన్ లో రుచికోసం ఒక కప్పు పల్లీలు కూడా వేయించుకోండి. ఇవి వేయకపోయినా కూడా రుచిగానే ఉంటుంది. మంట ఎక్కువగా ఉంటే ఇది కవర్ చేస్తుంది. వీటిని బాగా వేయించి చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.

ఈ మిశ్రమం చల్లారిన తరవాత రోటిలో ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి మిర్చి, వేయించిన పల్లీలు, చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ధనియాలు కూడా వేసి, ఇంకా నీటిని కూడా పోసి కచ్చా పచ్చాగా దీనిని దంచుకోవాలి. సరైన విధంగా ఈ పచ్చడి చేస్తే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు.

తాలింపు చేసుకోవాలి : చిన్న పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి పోపు చేసి ఈ పచ్చడిపై పోయాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇంకా ఈ పల్లెటూరి బండ పచ్చి మిర్చి పచ్చడి వేడి వేడి అన్నంతో తింటే ముద్ద ముద్దకు స్వర్గమే. ఇంకా చపాతీల్లోకి ఇంకా రుచిగా ఉంటుంది