స్నేక్ ప్లాంట్ ఒక సహజ గాలి శుద్ధి చేసే ఇండోర్ మొక్క. ఇది ఇంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుతుంది. దీనిని ఇంటి అలంకరణగా ఉపయోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుకోవటం వల్ల వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. సంపద, శ్రేయస్సుకు మార్గం తెరుస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ స్నేక్ ప్లాంట్‌ని డ్రాకేనా టైఫాసియాటా అని కూడా పిలుస్తారు. దీని ఆకులు మందంగా, కోణాలుగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ మొక్కను ఇంట్లో ఎందుకు నాటాలో తెలుసా?
వాస్తు, జ్యోతిషశాస్త్రం రెండింటిలోనూ స్నేక్ ప్లాంట్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇంట్లో దీన్ని పెంచుకోవటం వల్ల సంపద, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, దాని ప్రభావం మరింత శక్తివంతంగా మారుతుంది. స్నేక్ ప్లాంట్ వాతావరణంలో మంచి గాలి, స్వచ్ఛతను పెంచడానికి సహాయపడుతుంది. ఇంట్లో ముఖ్యమైన ప్రదేశాలలో దీన్ని ఉంచడం వల్ల ఇంట్లో స్వచ్ఛత ఉంటుంది. ఈ మొక్క ఇంటి నుండి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచుతుంది. సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.
మీ చుట్టూ ఒక స్నేక్‌ప్లాంట్ పెంచుకోవటం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పురోగతి కోరుకుంటే మీరు స్నేక్‌ప్లాంట్‌ని పెంచుకోవచ్చు.. ఇది భద్రతను పెంచుతుంది. మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయాన్ని అందిస్తుంది. స్నేక్‌ప్లాంట్ మొక్క ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇంట్లో ఆనందం, శాంతిని తెస్తుంది. కుటుంబ సభ్యుల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
సాధారణంగా స్నేక్ ప్లాంట్ తలుపు లేదా ప్రధాన ద్వారం దగ్గర ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. టేబుల్ లేదా క్యాబినెట్ పైన వంటి ఎత్తైన ప్రదేశంలో ఉంచడం వల్ల కూడా ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మొక్కను టాయిలెట్ నుండి దూరంగా ఉంచాలి ఎందుకంటే అక్కడ నుండి వెలువడే ప్రతికూల శక్తి దాని సహజ శక్తిని ప్రభావితం చేస్తుంది. ప్రత్యక్ష కాంతి పడేలా కిటికీ దగ్గర ఉంచాలి.
ఈ మొక్క ఇంట్లోని గాలిని శుద్ధి చేస్తుంది. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తూనే ఉంటుంది. ఈ స్నేక్ ప్లాంట్ మొక్కలు తక్కువ నీరు, తక్కువ కాంతితో జీవించగలవు. ఈ మొక్క సానుకూల శక్తిని పెంపొందించి, ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. ఈ మొక్కను మీ ఇంట్లో అలంకరణగా కూడా ఉపయోగించవచ్చు. రాత్రిపూట కూడా ఆక్సిజన్ విడుదల చేసే ఇండోర్ ప్లాంట్లలో ఈ స్నేక్ ప్లాంట్ ఒకటి. ఈ మొక్కను ఇంటి లోపల ఉంచడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్ర వస్తుంది.