
మనీ ప్లాంట్ ఆనందం, శ్రేయస్సు , సంపదకు చిహ్నంగా పరిగణించబడుతుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ని సరైన స్థానంలో సరైన దిశలో పెంచుకోవాలి. లేదంటే ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి బయట మనీ ప్లాంట్ ను నాటడం వల్ల దాని ప్రయోజనాలు ప్రతికూల ప్రభావాలుగా మార్చవచ్చు. అంతేకాదు ఇంటి మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెంచుకోవాలి. ఇది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆగ్నేయ కోణం గణేశుడు పాలిస్తాడు. ఇది శ్రేయస్సు సూచిస్తుంది మరియు ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం వలన గణపతి ఆశీర్వాదం, సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంటి లోపల పెంచడం సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. మనీ ప్లాంట్ ని బయట పెంచితే ఇంటి నుంచి డబ్బు బయటకు వెళ్లిపోతుందని సూచిస్తుంది. దీనివల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు.

మనీ ప్లాంట్లు ఇంటి లోపల బాగా పెరుగుతాయి. ఈ మొక్కకు ఎక్కువ సూర్యరశ్మి అవసరం లేదు, మరియు బయట ఉంచినప్పుడు, అది బాగా పెరగకపోవచ్చు లేదా సులభంగా ఎండిపోవచ్చు. కుంగిపోయిన లేదా అనారోగ్యకరమైన మనీ ప్లాంట్‌ను చెడు శకునంగా పరిగణిస్తారు. ఆర్థిక కొరతకు దారితీస్తుంది. సానుకూల శక్తిని, ఆర్థిక శ్రేయస్సును పెంపొందించడానికి, అనుకూలమైన వాతావరణంలో పెరిగేలా మొక్కను ఎల్లప్పుడూ ఇంటి లోపల ఉంచండి.

ఇంటి బయట బహిరంగ వాతావరణంలో మనీ ప్లాంట్ ప్రతికూల శక్తి, దుమ్ము , ధూళిని గ్రహిస్తుంది, దీని కారణంగా అది దాని సానుకూల శక్తిని కోల్పోతుంది. దాని శుభ ప్రభావం తగ్గుతుంది. మనీ ప్లాంట్ బయట ఉండి అందంగా ఉంటే.. దానిపై చెడు దృష్టి బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మనీ ప్లాంట్ పెరుగుదల ఆగి.. దురదృష్టానికి కారణం కావచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ చచ్చిపోవడం లేదా వాడిపోవడం వల్ల కుటుంబ సంబంధాలలో ఉద్రిక్తత, విభేదాలు, దూరం ఏర్పడతాయి. బయట ఉంచితే.. మనీ ప్లాంట్ త్వరగా చెడిపోయే అవకాశం ఉంది.

మనీ ప్లాంట్‌ను ఇంటి బయట నాటితే.. అది శత్రుత్వం , వివాదాలకు దారితీస్తుందని. ఇలా చేయడం వలన కుటుంబ సభ్యుల మధ్య మానసికంగా కలతలు ఏర్పడతాయని.. బంధం చెదిరిపోతుందని నమ్ముతారు. ఇంటి బయట మనీ ప్లాంట్ ఉంచడం వల్ల సానుకూల శక్తి , శ్రేయస్సు ఇంటి లోపలికి ఆకర్షించబడటానికి బదులుగా బయటికి ప్రవహిస్తుంది. దీని వలన ఇంట్లో ఆనందం , శాంతి కోల్పోతారు.