
కొన్ని సంప్రదాయాలలో ఇంట్లో పావురం ఈకను ఉంచుకోవడం అనేది అదృష్టాన్ని తీసుకుని వస్తుందని, సంపదను ఆకర్షించి ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుందని నమ్మకం. అంతేకాదు పావురం ఈక ఇంట్లో పెట్టుకోవడం అనేది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, జీవితంపై సానుకూల దృక్పథంతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు ఈ పావురం ఈకను కనిపించడం అంటే దేవదూతనుంచి లేదా ప్రియమైనవారి నుంచి వచ్చిన సందేశంగా అర్థం చేసుకోవచ్చు

ఇంట్లో ఆనందంకోసం: వాస్తు శాస్త్రం ప్రకారం కింద పడిపోయిన పావురం ఈకను తెచ్చుకుని తెల్లటి వస్త్రంలో దానిని కట్టి ఇంట్లో ఉంచాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. లక్ష్మీ దేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని నమ్ముతారు.

పురోగతికి మార్గం : పావురం ఈకలను ఉంచుకునే వారి ఇంట్లో సంపద దేవత అయిన లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. అలాగే లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఇంట్లోని వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ గొప్ప పురోగతి సాధిస్తారని అంటారు.

సమస్యలు తొలగిపోతాయి: ఇంట్లో పావురం ఈకను ఉంచుకోవడం ఆనందం, అదృష్టానికి సంకేతంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా దేవతలు ఎల్లప్పుడూ ఇంట్లో నివసిస్తారు. ప్రతికూల విషయాలు , శక్తులు ఇంటికి దూరంగా ఉంటాయి. ఇంట్లో ఏర్పడిన సమస్యలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.

సానుకూల శక్తి: నమ్మకాల ప్రకారం ఇంట్లో పావురం ఈకను ఉంచుకోవడం వల్ల చాలా సానుకూల శక్తి వ్యాపిస్తుందని నమ్ముతారు. పావురం ఈక ఉన్న ఇంట్లో గొడవలు లేదా విభేదాలు ఉండవని.. కుటుంబ వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని నమ్ముతారు.

పావురం ఈకను ఎక్కడ ఉంచాలి: వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్ దక్షిణ మూలలో, వంటగది ఉత్తర మూలలో.. బెడ్ రూమ్ తూర్పు మూలలో ఎవరూ చూడని చోట పావురం ఈకను ఉంచడం మంచిది.