యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) అనేది నేటి కాలంలో డిజిటల్ చెల్లింపుల అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతిగా మారింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఈ వ్యవస్థను ఉపయోగించి ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు డబ్బును బదిలీ చేస్తారు.
యూపీఐ ఫ్రాడ్ నివారణ చిట్కాలు: UPI వినియోగదారుల సంఖ్య పెరుగుతున్నందున దానికి సంబంధించిన మోసాల కేసులు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో యూపీఐ లావాదేవీలను నియంత్రించే సంస్థ ఎన్‌పీసీఐ యూపీఐ మోసాన్ని నిరోధించడానికి కొన్ని సులభమైన భద్రతా చర్యల గురించి సమాచారాన్ని అందించింది.
మీరు యూపీఐ చెల్లింపు చేసేటప్పుడు కూడా మీ లావాదేవీని సురక్షితంగా చేయాలనుకుంటే మీరు ఎన్‌పీసీఐ అందించిన చిట్కాలను అనుసరించవచ్చు. దాని గురించి తెలుసుకుందాం. NPCI ప్రకారం.. యూపీఐ వినియోగదారులు డబ్బును స్వీకరించడానికి పీన్‌ని నమోదు చేయవలసిన అవసరం లేదు. డబ్బును బదిలీ చేయడానికి ఎల్లప్పుడూ పిన్‌ని నమోదు చేయాల్సి ఉంటుంది.
ఖాతాకు డబ్బును బదిలీ చేయడానికి ముందు, డబ్బును స్వీకరించే వ్యక్తి యూపీఐ ఐడీని క్రాస్ చెక్ చేయండి. ధృవీకరణ లేకుండా ఎవరికీ చెల్లింపు ఇవ్వవద్దు. మీ యాప్ పిన్ పేజీలో మాత్రమే యూపీఐ పిన్‌ని నమోదు చేయండి. దీనితో పాటు మీ యూపీఐ పిన్‌ను ఎవరితోనూ షేర్ చేయవద్దు.
డబ్బు బదిలీ చేయడానికి మాత్రమే QR కోడ్ స్కాన్ చేయబడిందని గుర్తుంచుకోండి. డబ్బును స్వీకరించడానికి మీకు QR కోడ్ అవసరం లేదు. మీ మొబైల్‌లో ఎలాంటి స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయవద్దు. దీని కారణంగా యూపీఐ ఐడీ, పిన్ మొదలైన మీ వ్యక్తిగత సమాచారం దొంగిలించబడవచ్చు.