
పండితుల ప్రకారం, ఈ రోజు ఇంటి ప్రధాన ద్వారానికి మామిడి ఆకుల తోరణాలు కట్టడం వెనుక, శాస్త్రీయ , ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయంట. ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరూ గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు కట్టి, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు వేసి, ఇంటిని అలంకరించుకుంటారు. పండగ వైభవం మొత్తం గుమ్మంలోనే కనిపిస్తుంది. అంత అద్భుతంగా అలంకరిస్తారు.

అయితే ఇలా మామిడి ఆకు తోరణాలు అనేవి శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఉగాది పండుగ రోజున, ఇంటిలో సానుకూలతన పెంపొందించడానికి మామిడి ఆకు తోరణాలు కడుతారు. అంతేకాకుండా ఇవి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇంటికి శుభాన్నిస్తాయి. ఇవన్నీ కూడా ఇంటిలో సానుకూలత, ఆనందం, శ్రేయస్సు తీసుకొస్తాయని, ఇంటికి ఈ మామిడి ఆకు తోరణాలు కడతారంట.

శాస్త్రీయ పరంగా కూడా ఈ తోరణాలు కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. తోరణాలు శుభప్రదమైనవి. అంతేకాకుండా, వృక్షశాస్త్రం ప్రకారం, ఇవి చెట్టు నుంచి తీసిన తర్వాత చాలా సేపటి వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే లక్షణాన్ని కలిగి ఉంటాయి. అయితే పూర్వం కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగే సమయంలో ఎక్కువ మంది గుమి గూడే వారు. దాదాపు నలభై నుంచి, యాభైవరకు మంది గుంపులుగా ఒకే చోట చేరేవారంట.

అయితే ఇలా ఇంత మంది గుమిగూడిన సమయంలో ఆక్సిజన్ సరఫరా పెంచడానికి మామిడి ఆకు తోరణాలను కట్టడం అనే శాస్త్రీయమైన పద్ధతి ఆచారంగా ప్రారంభమైనదంట. అంతే కాకుండా ఇది ఇంటిలో సానుకూల శక్తిని పెంచుతుంది. వాస్తు ప్రకారం కూడా ఇంటిలో ఆనందం, శ్రేయస్సుకు కారణం అవుతుందంట.

అదేవిధంగా, ఉగాది నాడు కొత్త బట్టలు ధరించడం వెనుక ఒక సాంప్రదాయం ఉంది. పూర్వం ఇంటి పురోహితుడు, చాకలి, మంగలి, పనివారితో సహా ఇంటికి సేవలు అందించే వారందరికీ ఉగాది రోజున కొత్త వస్త్రాలు ఇచ్చేవారు. అలాగే, అత్తవారింటికి వెళ్ళిన ఆడపిల్లలను, అల్లుళ్లను ఇంటికి ఆహ్వానించి, వారికి నూతన వస్త్రాలు బహుమతిగా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. ఈ ఆచారం నుండే మనం కూడా కొత్త వస్త్రాలు ధరించే సాంప్రదాయం వచ్చింది. ఇది ఇతరులకు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పంచుకునే సంస్కృతికి ప్రతీక.