
ప్రస్తుతం ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. అయినప్పటికీ కూడా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ విలసవంతమైన సౌకర్యాలు మాత్రం తగ్గడం లేదు. అతడు ఎక్కవగా రూ.5 లక్షలకు పైగా విలువ చేసే హెన్నెస్సీ మద్యాన్ని సేవిస్తాడని యూకేకు చెందిన రక్షణ రంగ నిపుణులు ఓ పత్రికకు తెలిపారు.

అలాగే కిమ్ జోంగ్ ఉన్‌కు ఇష్టమైన బ్రెజిలీయన్ కాఫీ కోసం ప్రతిఏడాది 9.6 లక్షల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. అంతేకాదు అతడు తాగే సిగరెట్లు కూడా బంగారు రేకుతో చుట్టి ఉంటాయని పేర్కొన్నారు. అలాగే కిమ్‌కు మద్యంతో పాటు తినేందుకు ఇటలీలో ప్రత్యేకంగా తయారుచేసే పర్మా హోమ్ ఇంకా స్విస్ చీజ్‌ను ఆ దేశం దిగుమతి చేసుకుంటుంది.

గతంలో కిమ్, అతని తండ్రి కలిసి కొబే స్టీక్స్, క్రిస్టల్ షాంపైన్‌తో కూడిన ఆహరం తీసుకునేవాడని అతడి దగ్గర పనిచేసిన వాళ్లు చెప్పారు. 1997లో కిమ్ కోసం పిజ్జాలు చేసేందుకు ప్రత్యేకంగా ఇటలీ నుంచి ఓ చెఫ్‌ను కూడా తీసుకొచ్చినట్లు తెలిసింది.

అలాగే కిమ్ 2014లో తన లైంగిక సామర్థ్యం పెంచుకోవడం కోసం ఖరీదైన స్నేక్ వైన్ తాగేవాడని విషయం తెలిసింది. గతంలో అతడు 136 కిలోలు కూడా దాటిపోయారు. ఇది అప్పట్లో దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్ సంస్థ తన పరిశోధనల్లో కిమ్ ఆహరపు అలవాట్ల గురించి చెప్పిన నివేదికలో వెల్లడైంది.

కరోనా తర్వాత ఉత్తర కొరియాలో తీవ్ర ఆహార సంక్షోభం నెలకొంది. దీనిపై పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చెనా నుంచి కూడా ఎరువులు, ఆహారోత్పత్తికి అవసరమైన పరికరాలతో పాటు ధాన్యాల దిగుబడి కూడా ఆ దేశం ఆపివేసింది. దీనివల్ల ఆ దేశంలో పంట దిగుబడి లేక ఆహార సంక్షోభం మొదలైంది.