
నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. అందులో లోబీపీ ఒకటి. తక్కువ BP అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి సకాలంలో సరైన చికిత్స తీసుకోకపోతే చాలా ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

తక్కువ BP ఉన్నప్పుడు మైకము, హృదయ స్పందన నిదానంగా ఉండటం, అధిక నిద్ర, బద్ధకం, అలసట, వికారం, వాంతులు, విపరీతమైన చెమట, ఒళ్లు చల్లబడటం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కాబట్టి తక్కువ రక్తపోటును నివారించడానికి ఎక్కువగా నీరు తాగాలి. రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. ఎక్కువ పండ్లు, కూరగాయలు తినాలి. సోడియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వేడి టీ, కాఫీ తాగాలి.

క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయడం చాలా అవసరం. ఒకేసారి ఎక్కువ తినకూడదు. కానీ తక్కువ మొత్తంలో కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి.

అలాగే తక్కువ రక్తపోటుతో బాధపడేవారు తమ ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చు. గుడ్లు, పాలు, చేపలు, ద్రాక్ష, అరటిపండు, కివి, సూప్, ధాన్యాలు, సోడియం అధికంగా ఉండే ఆహారాలు రోజువారీ ఆహారంలో తీసుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా రక్తపోటును తనిఖీ చేసుకుంటూ ఉండాలి.