ఈ రకం కోళ్లల్లో 50 ఏళ్ల నాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. అలాగే వాటి రూపం అసాధారణంగా ఉండటం వల్ల ప్రపంచం దృష్టిని అవి ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.
తక్కువగా ఆహారం తీసుకోవడం, తొందరగా పెరగడం, కూలర్లు లాంటివి అవసరం లేకుండానే వేడిని తట్టుకనే లక్షణాలు ఆ జాతి కోళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. వడదెబ్బ, అధిక ఉష్ణోగ్రతలు, చర్మవ్యాధులు, దోమకాట్లను ఈ కోళ్లు తట్టుకుంటాయని తెలిపారు.