
తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది. గల్లీ గల్లీలో వినాయకుని మండపాలు దర్శనం ఇస్తున్నాయి. ఎటు చూసినా గణపయ్య నామ స్మరణతో మారుమోగుతోంది.. ఉదయం నుంచి భక్తులు.. భక్తిశ్రద్ధలతో గణేష్ విగ్రహలను ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతీ గడపా గణనాథుని నామస్మరణతో మార్మోగుతోంది.

ఈ క్రమంలోనే మీడియా దిగ్గజం టీవీ9 ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా, కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడు లాగే ఈ ఏడాది కూడా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాన్ని ప్రతిష్టించి టీవీ9 కుటుంబ సభ్యులంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ పవిత్ర కార్యక్రమంలో టీవీ9 ఛానల్ ముఖ్య అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛానల్ సీఎఫ్‌ఓ శివానంద పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నాలు తొలగాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని టీవీ9 ఆఫీస్‌లో జరిగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. హెచ్‌ఆర్ కల్యాణ్, అడ్మిన్ రాము, ఎడిటర్ వీరభద్రరావు తదితరులు వినాయక పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యాలయం మొత్తం పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం సిబ్బంది అందరూ కలిసి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఏటా ఇలాగే జర్నలిస్టులు, సిబ్బంది ఒకచోట చేరి పండుగను ఘనంగా జరుపుకోవడం శుభ పరిణామమని యాజమాన్యం పేర్కొంది.