Turmeric Water: పసుపునీళ్లతో చర్మ సమస్యలు పరార్.. మెరిసే అందం మీ సొంతం!

|

Sep 13, 2024 | 4:33 PM

పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. పసుపు ఆహారం రంగు, పోషణను మెరుగుపరచడానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలో కూడా తోడ్పడుతుంది. ఆయుర్వేదంలో దాని సహాయంతో అనేక రకాల ఔషధాలను కూడా తయారు చేస్తారు. జీర్ణక్రియ సాఫీగా ఉండాలన్నా, శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం పసుపు అనేక విధాలుగా మేలు చేస్తుంది. అంతేకాదు,పసుపు చర్మ సంరక్షణలో కూడా మేలు చేస్తుంది. మెరిసే చర్మం కోసం పసుపును ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కర్కుమిన్ మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇది మన చర్మాన్ని మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.  ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు నీళ్లతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. పసుపు నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

2 / 5
పసుపు నీరు ముఖానికి మెరిసే ఛాయను కలిగిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు పసుపు నీరు చాలా మంచిది. రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు తొలగిపోతాయి. పసుపులో ఉండే పోషకాలు చర్మాన్ని శుభ్రంగా, ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి. పసుపు నీరు చర్మం  దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది. ముఖంపై మచ్చలు, పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
పసుపు పిత్త ఉత్పత్తిని సక్రియం చేస్తుంది. ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే ఉన్న పిత్తాశయ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. పసుపును అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు పెరుగుతాయి.

4 / 5
ఇందుకోసం ఒక లీటరు నీటిని బాగా వేడి చేసి దానికి 2 స్పూన్ల పసుపు వేసి కలపాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు సగానికి తగ్గిన తరువాత స్టౌవ్‌ ఆఫ్‌ చేసి ఆ నీటిని ఫిల్టర్ చేసుకోండి. చల్లారిన తర్వాత దీన్ని ముఖానికి ఉపయోగించవచ్చు.

5 / 5
పసుపు కలిపిన పాలు తాగితే దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అలెర్జీ ప్రతిచర్యలకు దారి తీస్తుంది. మీలో కూడా ఈ లక్షణం కనిపిస్తే, పసుపు కలిపిన పాలు తాగడం మానేసి, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.