తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో కొత్త ఐటెమ్ వచ్చే ఛాన్స్

Edited By:

Updated on: Jun 10, 2026 | 1:07 PM

ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ 41 వసంతాలు పూర్తి చేసుకొని భక్తుల విరాళాలతో నడుస్తోంది. వెంకన్న దర్శనం కోసం కొండకు చేరుకున్న భక్తులకు అన్నప్రసాదాలు ఉచితంగా అందించాలని లక్ష్యంతో 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించిన నిత్యాన్న పథకం 1994 ఏప్రిల్ ఒకటిన శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టు గా మారింది.

1 / 5
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ 41 వసంతాలు పూర్తి చేసుకొని భక్తుల విరాళాలతో నడుస్తోంది. వెంకన్న దర్శనం కోసం కొండకు చేరుకున్న భక్తులకు అన్నప్రసాదాలు ఉచితంగా అందించాలని లక్ష్యంతో  1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించిన నిత్యాన్న పథకం 1994 ఏప్రిల్ ఒకటిన శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టు గా మారింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుగా అమలవుతోంది. మొదట ప్రధాన కళ్యాణకట్ట ఎదుట ఉన్న భవనంలో అన్న ప్రసాద వితరణ జరగగా భక్తుల రద్దీ పెరగడంతో వరాహ స్వామి ఆలయం వద్ద పారి భవనాన్ని నిర్మించి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంగా 2011 జులై 7న అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అందుబాటులోకి తెచ్చారు.

2 / 5
తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం లోనే కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1,2 లోని కంపార్ట్మెంట్లు, ఆలయం బయట క్యూలైన్లు, పీఏసీ సెంటర్లు, నడకమార్గాలు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలు, తిరుపతిలోని ఆసుపత్రుల్లో టిటిడి అన్న ప్రసాదాల వితరణ చేస్తోంది. టీటీడీ ఎన్నో ట్రస్టులను నిర్వహిస్తున్నా భక్తుల ఆకలి తీర్చే ట్రస్టు కావడంతో భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతున్నాయి. దాతలు సమర్పించే విరాళాల లెక్కల ప్రకారం ట్రస్ట్ లో రూ. 2,553 కోట్ల విరాళాలు ఉండగా ఒక్కరోజు అన్న ప్రసాద వితరణకు రూ. 44 లక్షల విరాళాన్ని టిటిడి స్వీకరిస్తుంది.

3 / 5
ఇక రోజు రెండు లక్షల మందికి పైగానే భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తుండగా పర్వదినాలు ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య 3 లక్షలకు పైగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మేరకు  రైస్ మిల్లర్లతో నిర్వహించిన టీటీడీ అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సేకరిస్తోంది. శ్రీ వేంకటేశ్వర
స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే లక్ష్యమని టీటీడీ భావిస్తోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో స‌మావేశం నిర్వ‌హించిన టిటిడి  నాణ్యమైన ముడి దినుసుల సరఫరాలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసింది.

ఇక రోజు రెండు లక్షల మందికి పైగానే భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తుండగా పర్వదినాలు ఉత్సవాల సమయంలో ఆ సంఖ్య 3 లక్షలకు పైగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రైస్ మిల్లర్లతో నిర్వహించిన టీటీడీ అన్న ప్రసాదాల నాణ్యతపై భక్తుల అభిప్రాయాలను సేకరిస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే లక్ష్యమని టీటీడీ భావిస్తోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైస్, దాల్ మిల్లర్లతో స‌మావేశం నిర్వ‌హించిన టిటిడి నాణ్యమైన ముడి దినుసుల సరఫరాలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసింది.

4 / 5
ఇక భక్తుల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ లో దాదాపు 98 శాతానికి పైగా భక్తులు  అన్నప్రసాదం రుచి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు గుర్తించింది. అభిప్రాయ సేకరణలో కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని తెలపడంతో టీటీడీ ఆదిశగా చర్యలు చేపడుతోంది. భక్తుల సూచన పట్ల సానుకూలంగా పరిగణిస్తోంది. అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని  అధికారులను సూచించింది. ప్రస్తుతం అన్నం తో పాటు వెజిటబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్ని, చక్కెర పొంగలితో పాటు వడను కూడా వడ్డించనున్నారు. ఇలా ఏడు రకాల రుచులను అన్నప్రసాదంగా  
అందిస్తున్న టీటీడీ ఇకపై పప్పును జోడించాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించబోతోంది.

ఇక భక్తుల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ లో దాదాపు 98 శాతానికి పైగా భక్తులు అన్నప్రసాదం రుచి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు గుర్తించింది. అభిప్రాయ సేకరణలో కొందరు భక్తులు అన్నప్రసాదంతో పాటు అదనంగా పప్పును కూడా వడ్డిస్తే మరింత బాగుంటుందని తెలపడంతో టీటీడీ ఆదిశగా చర్యలు చేపడుతోంది. భక్తుల సూచన పట్ల సానుకూలంగా పరిగణిస్తోంది. అవకాశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించింది. ప్రస్తుతం అన్నం తో పాటు వెజిటబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్ని, చక్కెర పొంగలితో పాటు వడను కూడా వడ్డించనున్నారు. ఇలా ఏడు రకాల రుచులను అన్నప్రసాదంగా అందిస్తున్న టీటీడీ ఇకపై పప్పును జోడించాలని భావిస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించబోతోంది.

5 / 5

ఇక అన్న ప్రసాదంలో టీటీడీ వినియోగించే ముడి సరుకులు కల్తీ కి ఛాన్స్ లేకుండా టిటిడి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఎంపానల్ వ్యవస్థ ద్వారా ముడి పదార్థాల కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ మరింత మెరుగైన పాలసీని టిటిడి అభివృద్ధి చేస్తుంది. అన్నప్రసాదం నాణ్యతను మెరుగు పరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీటీడీకి అవసరమైన పలు ర‌కాల పప్పు దినుసులను ట్రేడర్ల నుంచి కాకుండా  దాల్ మిల్లర్లు, అసోసియేషన్ ల నుంచి సరఫరా చేసే అంశంపై చర్చిస్తోంది.  టీటీడీ నియమ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు అత్యుత్తమ నాణ్యత గల ఆహార పదార్థాలు అందించే దిశగా విధివిధానాలు రూపొందిస్తోంది.

Follow Us