TSRTC: అరుణాచ‌లం టూర్ ప్యాకేజీకి విశేష స్పంద‌న.. గంటల్లోనే 13 బస్సుల బుకింగ్.. సజ్జనార్ ఏమన్నారంటే..

|

Jun 28, 2023 | 1:31 PM

TSRTC MD Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. సంస్థ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు చేరువయ్యేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది.

1 / 5
TSRTC MD Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC).. సంస్థ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రయాణికులకు చేరువయ్యేందుకు సన్నాహాలను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ప్రత్యేక ప్యాకేజీలతో ముందుకు వెళ్తోంది. అయితే, జులై 3న గురు పౌర్ణమి సంద‌ర్భంగా TSRTC అందుబాటులోకి తెచ్చిన అరుణాచ‌లం టూర్ ప్యాకేజీకి భ‌క్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోన్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం పేర్కొన్నారు.

2 / 5
జులై 3న గురు పౌర్ణమి సంద‌ర్భంగా అరుణాచ‌లం స్వామి దర్శనం కోసం అరుణాచ‌లం టూర్ ప్యాకేజీని ప్రవేశపెట్టింది. అయితే, TSRTC అందుబాటులోకి తెచ్చిన అరుణాచ‌లం టూర్ ప్యాకేజీ  భ‌క్తుల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోందని టీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.

3 / 5
అరుణాచ‌లానికి ఇప్పటివరకు 15 ప్రత్యేక సూప‌ర్ లగ్జరీ బ‌స్సులను ఏర్పాటు చేయ‌గా.. 13 బ‌స్సుల్లో సీట్లన్నీ ఫుల్ అయినట్లు తెలిపారు. మిగిలిన రెండు బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ ప్రక్రియ ప్రస్తుతం కొన‌సాగుతోందని తెలిపారు.

4 / 5
రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన గంట‌ల వ్యవధిలోనే భ‌క్తులు టికెట్లను బుకింగ్ చేసుకుంటున్నారని సజ్జనార్ తెలిపారు. ఇప్పటివరకు హైద‌రాబాద్ నుంచి 12, వేముల‌వాడ నుంచి 2, మ‌హ‌బుబ్‌న‌గ‌ర్ నుంచి ఒక బ‌స్సును అరుణాచ‌లానికి ఏర్పాటు చేశామని తెలిపారు.

5 / 5
భ‌క్తుల డిమాండ్ దృష్ట్యా మ‌రిన్నీ ప్రత్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసేందుకు సంస్థ సిద్ధంగా ఉందని సజ్జనార్ స్పష్టంచేశారు. అరుణాచ‌ల టూర్ ప్యాకేజీ ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ www.tsrtconline.in ను సంప్రదించాలని సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.