ఇన్నాళ్ళు ఈ ఎనర్జిటిక్ పచ్చడి ఎలా మిస్సయ్యారండి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే

Updated on: Aug 18, 2026 | 9:58 PM

రోజూ ఇంట్లో కూరలు తిని బోర్ కొట్టినప్పుడైనా లేదా నోటికి కాస్త కారంగా, కమ్మగా ఏదైనా తినాలనిపించినప్పుడైనా మన సంప్రదాయ రోటి పచ్చళ్లు గుర్తొస్తాయి. పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు రోట్లో నూరిన పచ్చళ్ల రుచే వేరు. అలాంటి పాతకాలపు పద్ధతిలో ఎముకల బలానికి ఎంతో మేలు చేసే తెల్ల నువ్వులు, టమాటాలతో అద్భుతమైన ఎనర్జిటిక్ రోటి పచ్చడిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ముద్ద ముద్దకి ఆహా అనిపించే ఈ పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావలసిన పదార్థాలు: 50 గ్రాములు తెల్ల నువ్వులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 10 నుండి 12 ఎండుమిర్చి, నాలుగు నాటు టమాటాలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, పిడికెడు తాజా కొత్తిమీర, ఒకటి వెల్లుల్లి గడ్డ, ఒకటి ఉల్లిపాయ, ఉప్పు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు.

2 / 5
తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో తెల్ల నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. నువ్వులు మాడిపోకుండా మంచి సువాసన వచ్చే వరకు వేపి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే బాండీలో ఒక చెంచా నూనె వేసి ఎండుమిర్చిని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
మరో చెంచా నూనె వేసి తరిగిన టమాటా ముక్కలు, చింతపండు వేసి కలపాలి. టమాటాలు మెత్తగా మగ్గాక పిడికెడు కొత్తిమీర వేసి వాడనిచ్చి స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో ముందుగా వేయించిన నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత వేయించిన ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నూరాలి.

4 / 5
అనంతరం పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి దంచాలి. ఇప్పుడు మగ్గించి పెట్టుకున్న టమాటా, చింతపండు, కొత్తిమీర మిశ్రమాన్ని వేసి చక్కగా రుబ్బుకోవాలి. చివరగా ఒక ఉల్లిపాయను వేసి ముక్కలు ముక్కలుగా, తేలికగా కచ్చాపచ్చాగా దంచి పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

5 / 5
స్టవ్ మీద చిన్న కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, తుంచిన ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. పోపు చక్కగా వేగాక స్టవ్ ఆపేసి, రోట్లో నూరిన పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఘుమఘుమలాడే సంప్రదాయ నువ్వుల రోటి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే కడుపు నిండుతుంది, మనసు తృప్తి చెందుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us