ఇంట్లో తాబేలు ప్రతిమ, విగ్రహాం ఉంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయని జ్యోతిష్యా, వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చాలా మంది ఇళ్లలో తాబేలు ప్రతిమలు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అయితే, ఇది ఇంట్లో ఏ దిక్కున ఉంటే ఎలాంటి ఫలితాలనిస్తుందో తప్పని సరిగా తెలుసుకోవాలని చెబుతున్నారు.
ఇంట్లో తాబేలు బొమ్మ ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. అది మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. కెరీర్ లో వృద్ధి సాధించాలనుకుంటే తాబేలు బొమ్మ ఉత్తర దిశలో పెట్టుకోవాలని చెబుతున్నారు ఫెంగ్ షూయి ప్రకారం తాబేలు జ్ఞానం, ఓర్పు, దీర్ఘాయువుని సూచిస్తుంది.
తాబేలు ప్రశాంతమైన, దీర్ఘాయుష్షు గల జీవి. మీ ఇంటి పూజా మందిరంలో తాబేలు లేదా అష్టధాతువుతో చేసిన తాబేలు చిత్రాన్ని కూడా ఉంచవచ్చు. తాబేలును నీటితో నిండిన ఇత్తడి లేదా అష్టధాతు పాత్రలో ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం అంటున్నారు.
తాబేలును ఇంటిలో ఈశాన్యంలో పెట్టుకొవాలని పండితులు చెబుతున్నారు. తాబేలు ప్రతిమను ఒక పాత్రలో నీళ్లు వేసి దానిలో పెట్టుకొవాలి. తాబేలు ప్రతిమ మీద ప్రతిరోజు ఒక తులసీ దళం ఉంచాలి. పనిమీద బైటకు వెళ్లేటప్పుడు తాబేలును చూసి వెళ్తే పని సక్సెస్ అవుతుంది. తాబేలు ధనాన్ని, పాజిటివ్ ఎనర్జీనీ ఇంట్లో నుంచి బైటకు వెళ్లకుండా కాపాడుతుంది.
మెటల్ తాబేలు ప్రతిమను ఉత్తరం లేదా వాయువ్య దిశలో పెట్టుకోవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాన ఉంచినప్పుడు పిల్లల జీవితం బాగుంటుంది. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. వాయువ్య దిశలో ఉంటే మనసు చదువు మీద దృష్టి పెట్టేందుకు సహకరిస్తుంది.