ఇంట్లో ఈ మొక్కలు ఉంటే చాలు.. మీ తలరాతే మారిపోతుంది.. డబ్బే డబ్బు..

Updated on: Apr 16, 2026 | 10:04 AM

మన ఇంట్లో మనం పెంచుకునే మొక్కలు కేవలం అందానికి మాత్రమే కాదు, అవి ఇంటి వాతావరణాన్ని, మన ఆర్థిక స్థితిని ప్రభావితం చేసే శక్తిని కూడా కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం, ఫెంగ్ షుయ్ ప్రకారం.. కొన్ని రకాల మొక్కలు సంపదను ఆకర్షించి, ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. మీ ఇంట్లో సుఖశాంతులు, శ్రేయస్సు వెల్లివిరియాలంటే ఉండాల్సిన ఆ ముఖ్యమైన మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
క్రాసులా: క్రాసులా మొక్కను మనీ ట్రీ లేదా సక్సెస్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. దీని దట్టమైన, గుండ్రని ఆకులు ఆర్థిక స్థిరత్వానికి చిహ్నాలు. ఇది అయస్కాంతంలా సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఈ మొక్కను ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి.

2 / 5
మనీ ప్లాంట్ : దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే ఈ మొక్క, సానుకూల శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనీ ప్లాంట్ ఎప్పుడూ పచ్చగా ఉండాలి. ఇది ఎండిపోతే ఆర్థిక ఇబ్బందులకు సంకేతంగా భావిస్తారు. ఇంటి లోపల లేదా బాల్కనీలో పెంచడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి.

3 / 5
శమీ మొక్క : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శమీ వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి శని దేవుడు, వినాయకుడి అనుగ్రహం ఉంటుందని చెబుతారు.
 శని దోషాలను నివారించి, పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. దసరా పండుగ రోజున ఈ చెట్టును పూజించడం వల్ల విజయాలు ప్రాప్తిస్తాయి.

శమీ మొక్క : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శమీ వృక్షానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనికి శని దేవుడు, వినాయకుడి అనుగ్రహం ఉంటుందని చెబుతారు. శని దోషాలను నివారించి, పనుల్లో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. దసరా పండుగ రోజున ఈ చెట్టును పూజించడం వల్ల విజయాలు ప్రాప్తిస్తాయి.

4 / 5
స్నేక్ ప్లాంట్: దీనిని సర్ప వృక్షం అని కూడా అంటారు. ఇది ఇంటిలోని గాలిని శుద్ధి చేయడమే కాకుండా చెడు ప్రభావాలను దరిచేరనివ్వదు. మానసిక ప్రశాంతతను అందిస్తూ, ప్రతికూల శక్తిని గ్రహిస్తుంది. దీనిని హాలులో లేదా పడకగదిలో ఉంచడం శుభప్రదం.

5 / 5
తులసి మొక్క:  భారతీయ సంస్కృతిలో తులసికి ఉన్న ప్రాముఖ్యత అనన్యం. దీనిని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. తులసి కోట ఉన్న ఇంట్లో శాంతి, సంతోషం నెలకొంటాయి. ప్రతిరోజూ తులసి పూజ చేయడం వల్ల ఆర్థిక శ్రేయస్సు కలుగుతుంది.

Follow Us