
ప్రపంచంలోనే అత్యధిక వెండిన నిల్వలు కలిగిన దేశాల జాబితాలో పెరూ మొదటి స్థానంలో నిలిచింది. ఈ దేశంలో దాదాపు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. ఈ దేశంలోని వెండి నిల్వలకు ప్రధాన కేంద్రం హువారి ప్రాంతంలో ఉన్న అంటమినా గని. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని వెండి గనుల్లో కెళ్లా.. ఈ గనిలోని ఎక్కువ వెండి ఉత్పత్తి అవుతుందట. ఈ గని పెరూ దేశాన్ని ప్రపంచ వెండి మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంచడంలో కీలక పాత్ర పోశిస్తుంది.

ఇక ప్రపంచంలో భారీగా వెండి నిల్వలు కలిగిన రెండో దేశం రష్యా. ఈ దేశంలో దాదాపు 92,000 టన్నుల వెండి నిల్వలు ఉన్నాయట. ఈ దేశంలోని సైబీరియా, ఉరల్ ప్రాంతాలలోని ఉన్న గనులే ఈ వెండి ఉత్పత్తులకు ప్రధాన కేంద్రాలు. రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచ వెండి ఉత్పత్తులతో రష్యా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వెండి ఎగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

ఇక ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశాల జాబితాలో చైనా మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో దాదాపు 70,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. దేశంలోని హెనాన్ ప్రావిన్స్‌లో ఉన్న యింగ్‌గువాన్ గని చైనా వెండి నిల్వల్లో కీలక పాత్ర పోశిస్తుంది.ఈ మధ్య కాలంలో చైనా ప్రభుత్వం ఖనిజ రంగం భారీ పెట్టుబడులు పెట్టింది. ఇది ఖనిజ ఉత్పత్తులను వేగంగా పెంచడంలో సహాయపడుతుంది.

ఇక ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశాల జాబితాలో పోలాండ్ ఉంది. అక్కడ దాదాపు 61,000 టన్నుల వెండి నిల్వల ఉన్నాయి. ఈ దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ KGHM పోలాండ్‌కు వెండి, రాగి అందించడంలో కీలక పాత్ర పోశిస్తుంది. ఇక ఐదో ప్లేస్‌లో మెక్సికో కొనసాగుతుంది. ఈ దేశంలో సుమారు 37,000 టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. ఈ దేశంలోని జకాటెకాస్ ప్రాంతంలో ఉన్న పెనాస్క్విటో గని నుంచి మెక్సికోకు భారీగా వెండి అందుతుంది. ప్రపంచలోనే అతి పెద్ద వెండి గనులలో ఇది కూడా ఒకటి

అయితే వెండిని ఎక్కువగా ఉపయోగించే దేశాలలో భారత్ ఒకటి అయినప్పటికీ.. వెండి ఉత్పత్తిలో మాత్రం మనం చాలా వెనబడి ఉన్నాం. కొత్త గనుల ఆవిష్కరణ, సాంకేతిక అభివృద్ధి, ఖనిజ విధానాలలో మార్పుల ద్వారా రాబోయే రోజుల్లో భారత్ తన స్థానాన్ని మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి రోజురోజుకూ వెండి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వెండి నిల్వలో టాప్-5లో ఉన్న ఈ దేశాలు ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేయవచ్చు.