
టమాటా ధరలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఇవి ఒక్కోసారి ధరలు అమాంతం పెరుగుతాయి. ఇంకోసారి భారీగా తగ్గుతాయి. అయితే, ఇలా తగ్గిన రోజులు 5 కేజీలు ఒకేసారి కొనేసి నిల్వ చేస్తారు.

అయితే, ఇది కొంత వరకు ఓకే కానీ, టమాటాలను అతిగా తినొద్దని నిపుణులు కూడా చెబుతున్నారు. దీని మీద పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలను వెల్లడించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

టమాటాలు ఎక్కువగా తింటే కడుపు మంట సమస్యలు తలెత్తుతాయి. వీటిని తిన్న తర్వాత అజీర్తి , జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటిని ఎక్కువగా తినకండి.

కొందరికి రక్తం గడ్డకట్టదు. అలాంటి వాళ్ళు మందులు ఉపయోగిస్తారు. వీటిని తినడం వలన ఆ మందులకు ఇది హాని చేస్తుంది. కాబట్టి, మీరు కూరల్లో వేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా వేసుకోకండి.

ముఖ్యంగా, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కొంచం జాగ్రత్తగా ఉండాలి. వీటిలో ఉండే ఆక్సలేట్ అనే పదార్ధం కిడ్నీలో రాళ్లను పెరిగేలా చేస్తుంది. అలర్జీ సమస్యలున్న వాళ్లు కూడా టమాటాలను తినకపోవడమే మంచిది.