అధిక బరువు అనేది ఎవరికైనా పెద్ద సమస్యే. అయితే బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు తప్పనిసరిగా అందుకు తగిన ఆహారపు అలవాటను పాటించి తీరాలి. ఈ క్రమంలో మన వంట గదిలోనే లభించే కొన్ని రకాల పదార్థాలు ఇందుకు ఎంతగానో ఉపకరిస్తాయి.
వాము: కూరలలో మసాలాదినుసుగా ఉపయోగించే వాము జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు ప్రతి రోజూ ఉదయం పూట వాము నీటిని తాగాలి.
మజ్జిగ: మజ్జిగ శరీరాన్ని చల్లబరచడానికే కాక బరువును తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు.. శరీరంలోని కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
పెసర్లు: నిపుణుల ప్రకారం.. పప్పులు బరువు తగ్గడానికి పనిచేస్తాయి. మాంసకృత్తులు అధికంగా ఉండే పెసర్లు నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా మీకు ఆకలి కోరికలు కలగకుండా చేస్తుంది.
ఓట్ మీల్: నేటికీ ఇళ్లలో అల్పాహారంగా ఓట్ మీల్స్‌ని తీసుకుంటారు. ఇది తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. తద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు.