
Tirupati Railway Station: తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తిరుపతి రైల్వే స్టేషన్‌కు సంబంధించిన డిజైన్లను విడుదల చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకునే తిరుపతి రైల్వే స్టేషన్‌కు ‘ప్రధాన ‘రైల్వే స్టేషన్ల అభివృద్ధి’ ప్రాజెక్టులో అవకాశం కల్పిస్తూ ఇండియన్ రైల్వే నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్‌ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దీంతోపాటు ఫొటోలను సైతం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

కాగా.. దీనిని ఈపీసి విధానంలో కాంట్రాక్ట్ ఇచ్చినట్లు రైల్వే పేర్కొంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులు వేగంగా జరగనున్నాయి.

తిరుపతి రైల్వే స్టేషన్ కొత్త నిర్మాణం ద్రవిడ ఆలయ నిర్మాణాల తరహా (Dravida temple structures) లో ఉంది. కాగా.. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.

ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి తగినట్లు స్టేషన్ ఉండాలని సూచిస్తున్నారు. స్టేషన్ నమూనా ఏదో ఐటీ భవనంలా ఉందంటూ పేర్కొంటున్నారు నెటిజన్లు.