
గ్లాసుడు నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కండరాల నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. సాధారణంగా చెమటలు పట్టినప్పుడు శరీరం నుండి ముఖ్యమైన ఖనిజాలు పోతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరంలో ఎలక్ట్రోలైట్స్ తగ్గితే డీహైడ్రేషన్, దాహం, మలబద్ధకం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి నీటిలో కొద్దిగా ఉప్పు కలపడం మంచిది.

సౌర శుద్ధి.. నీటిని శుద్ధి చేయడానికి ఒక సహజమైన, పురాతనమైన పద్ధతి. గతంలో నీటిని శుద్ధి చేయడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగించేవారు. ఒక పాత్రలో నీటిని నింపి ఎండలో ఉంచితే, సూర్యుని వేడి దానిని శుద్ధి చేస్తుంది. నీటిలోని బ్యాక్టీరియా, వైరస్‌లను పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ పద్ధతిని ఉపయోగించి నీటిని శుద్ధి చేయవచ్చు. అలాగే సుదూర ప్రాంతాలకు పర్యటనకు వెళుతుంటే మీతో పాటు కెటిల్స్ తీసుకెళ్లవచ్చు. అది పెద్దగా బరువుగా ఏమీ ఉండదు. అయితే ప్రయాణ సమయంలో ఏ రకమైన నీటిని అయినా వేడి చేసి, తెల్లటి గుడ్డ ద్వారా వడకట్టి తాగడం మంచిది.

ఇవన్నీ కాకుండా నదులు, చెరువులు, సరస్సులు, బావుల నుంచి వచ్చే నీరు త్రాగడానికి శుభ్రంగా ఉంటుంది. వేసవి కాలం కాబట్టి కొన్ని ప్రాంతాల్లో నీరు దొరకకపోవచ్చు. అలాంటి సందర్భాలలో మట్టి కుండలు లేదా మట్టి సీసాలలో నిల్వ చేసిన నీటిని తాగవచ్చు. కుండలలో లేదా మట్టి పాత్రలలో నిల్వ చేసిన నీరు కూడా ఒక రోజు మాత్రమే తాగడానికి అనుకూలంగా ఉంటుంది. మరుసటి రోజు వాటిని తొలగించి కొత్త నీటితో నింపాలి.

సాధారణంగా నీటిని శుద్ధి చేయడానికి క్లోరిన్‌ను ఉపయోగించవచ్చు. నీటిలో క్లోరిన్ కలపడం వల్ల నీటిలోని వైరస్‌లు, బ్యాక్టీరియా నశిస్తాయి. కానీ దీనిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి. నీటికి 5 శాతం క్లోరిన్ మాత్రమే వాడాలి.

గోరు వెచ్చని నీళ్లు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. పేగు కండరాలను సడలించి, ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరం నిర్విషీకరణకు సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో సహాయపడుతుంది.