ఉల్లిపాయ మంచూరియా.. ఇలా చేస్తే అదిరిపోతుంది అంతే!

Updated on: Feb 21, 2026 | 9:47 PM

మంచూరియా అంటే చాలు ప్రతి ఒక్కరికీ తినాలనే కోరిక కలుగుతుంది. అయితే మీరు కూడా ఇంట్లోనే మంచూరియా చేసుకొని ప్రతి రోజూ తినాలి అనుకుంటున్నారా? అయితే ఎప్పుడూ చేసే క్యాబేజీ, గోబీతో కాకుండా, ఉల్లిపాయలతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5
కావాల్సిన పదార్థాలు : ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, నూనె వేయించడానికి, కొత్తిమీ, ఆనియన్స్ గార్నిష్ కోసం, మైదా పిండి పావు కప్పు, కార్న్ ఫ్లోర్ పావు కప్పు, ఉప్పు కారం రుచికి సరిపడ, అల్లం వెల్లుల్లి , పచ్చి మిర్చి రెండు.

2 / 5
తయారీ విధానం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, మొక్క జొన్న పిండి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, వేసి మంచిగా అన్ని కలిసేలా కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్లు పోసి మిశ్రమాన్ని పకోడి పిండిలా రెడీ చేసుకోవాలి.

3 / 5
దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకోవాలి. నూనె వేడి అయిన తర్వాత  మనం ముందుగా కలుపుకున్న పిండి, మంచూరియాల చిన్న చిన్న ముద్దల్లా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. బంగారం రంగు వచ్చిన తర్వాత వేరే బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని, ఇందులో సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, కార్న్ ప్లోర్, అన్ని వేసుకొని, కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 5 నిమిషాలు దీనిని పక్కన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి,  నూనె పోసి, అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు క్యాప్సికం ముక్కలు అన్ని వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కారం, ఉప్పు చల్లుకుంటే, చాలా టేస్ట్ వస్తుంది.ఇవి మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

5 / 5
ఇప్పుడు మనం రెడీ చేసుకున్న సాస్ మిశ్రమం తీసుకొని , అందులో వేయించి పెట్టుకున్న మంచూరియా ఉండలు వేయాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం చివరగా వేయించి పెట్టుకున్న పచ్చి మిర్చి , వెల్లుల్లి ముక్కలు వేసి , కొంచెం కొత్తిమీర, ఆనియన్స్ ముక్కలు పైన చల్లుకుంటే, టేస్టే టేస్టీ ఆనియన్ మంచూరియా రెడీ.

Follow Us