
మగవారిలో చాలా మంది బొప్పాయి ఎక్కువగా తింటారు. అయితే, కొందరికి వీటిని తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయి పండును తినకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జీర్ణక్రియ, మలబద్ధకం సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఈ సమస్యతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాళ్లు తక్కువగా తీసుకోవాలి

కిడ్నీలో రాళ్ళు : కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు వీటిని తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే వీటిలో ఉండే ఫైబర్ మగవారిని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి, వీళ్ళు కూడా బొప్పాయిని ఎక్కువగా తినకూడదు.

మగవారిలో కొందరికి బొప్పాయి పండ్లు తిన్న వెంటనే అలెర్జి వంటి సమస్యలు వస్తాయి. ఇంకా వీరిలో కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు బొప్పాయిని అస్సలు తినకండి.

సంతానోత్పత్తి: బొప్పాయిని మగవారు తింటే పిల్లలు పుట్టడం పై తీవ్ర ప్రభావం చూపుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. అయితే, దీని గురించి సరైన ఆధారాలు ఎక్కడా లేవు.(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)