సాధారణంగా రోజుకు మూడు పూటలు తినడం అనేది కామన్ విషయం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రికి టిఫిన్ లేదా భోజనం చేయడం సాధారణమే. కానీ మూడు పూటల కంటే ఎక్కువగా తింటే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదం.
కొందరిలో ఆకలి అనేది ఎక్కువగా ఉంటుంది. కడుపు నిండా తిన్నా మరికాసేపటికి ఆకలి వేస్తుంది. ఇలా చేయడం వల్ల బరువు అనేది ఓవర్‌గా పెరుగుతారు. దీని వల్ల అనేక ఇతర సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఆకలిని కంట్రోల్‌లో ఉంచుకోవడం చాలా అవసరం.
మీరు ఎక్కువగా తినేస్తున్నారని అనిపిస్తే.. తీసుకునే ఆహారం విషయంలో చిన్న మార్పులు చేయండి. ఉదయం టిఫిన్ చేసే ముందు ఏదన్నా డీటాక్స్ డ్రింక్స్, బాదం వంటి నట్స్ తినాలి. ఇవి తినడం బ్రేక్ ఫాస్ట్ తక్కువగా తింటారు.
మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం చేసే ముందు ఏదన్నా హెల్దీ సూప్ తాగండి. దీని వల్ల త్వరగా కడుపు నిండుతుంది. ఇతర ఆహారాలు ఎక్కువగా తినలేరు. ఎక్కువ ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. దీంతో బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
ఆహారం తినే ముందు అల్లం రసం తాగడం వల్ల ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నా అదుపులోకి వస్తుంది. డార్క్ చాక్లెట్, బనానా తిన్నా ఆకలి అనేది తగ్గుతుంది. ఉడికించిన పెసలు, బఠానీలు తిన్నా ఆకలి కంట్రోల్ అవుతుంది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)