
తేనే మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేసినప్పటికీ వృద్దులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలని, వీలైనంతా తక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మదుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు.

తేనె, తేనెటీగ పుప్పొడి లేదా ఏదైనా ఇతర తేనెటీగల సంబంధిత ఉత్పత్తులకు అలెర్జీలు లేదా హైపర్సెన్సిటివిటీ ఉన్నవారు తేనెను నివారించాలి.అలాగే ఇతర ఆరోగ్య సమస్యలకు యాంటీకోగ్యులెంట్, యాంటీప్లేట్‌లెట్ మందులు తీసుకునేవారు కూడా తేనెను తినకూడదు. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వడం అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రాసెస్ చేయని తేనెలో తేనెటీగ కుట్టడం, చిన్న కీటకాలు, పురుగుమందులు, రసాయనాలు ఉండవచ్చు, ఇవి పిల్లలలో వాంతులు, వికారం, జ్వరానికి కారణమవుతాయి. కాబట్టి పిల్లలకు తేనెను ఇచ్చేముందు వైద్యులను సంప్రదించండి

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, పురుషులు రోజుకు తేనె వంటి 9 టీస్పూన్ల (36 గ్రాములు) వరకు స్వీటెనర్లను తీసుకోవచ్చు. అలాగే మహిళలు రోజుకు 6 టీస్పూన్ల (24 గ్రాములు) వరకు స్వీటెనర్లను తీసుకోవచ్చు. ఎవరూ అంతకు మించి తేనె తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఎందుకంటే తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు, ప్రేగులకు దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుంది, దీనివల్ల ఉబ్బరం, అపానవాయువు, తిమ్మిర్లు, అలాగే విరేచనాలు కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.( NOTE: పైన పేర్కొన్న ఆంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)