
ఐస్ వాటర్ : మీ ముఖానికి అప్పడప్పుడు ఐస్ వాటర్ కూడా పెడుతూ ఉండండి. ఇలా చేస్తే చర్మం మీద ఉండే స్వేద గ్రంధులను మూసుకుపోతాయి. అప్పుడు మీరు వేసుకున్న మేకప్ ఆక్సిడైజ్ కాకుండా ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది.

ఐబ్రో హోల్డింగ్ ట్రిక్ : చెమటతో మీ ఐబ్రోస్ పోకుండా ఉండాలంటే.. అప్పుడు మీ హెయిర్ స్ప్రేను బ్రష్‌కు అప్లై చేసి అలా సెట్ చేసుకోండి. దీనిని ఇది ప్రొఫెషనల్ యాంకర్లు ఎక్కువగా ఫాలో అవుతారు.

నెయ్యి : పెదవులకు కొత్త కొత్త లిప్ ప్రైమర్స్ వాడే కంటే మీ ఇంట్లో ఉండే నెయ్యి అన్నింటికంటే బాగా పని చేస్తుంది. లిప్‌స్టిక్ వల్ల వచ్చే పెదవుల పై వచ్చే పగుళ్ళను తగ్గించి, బలపడేలా చేస్తుంది.

హైలైటర్ : ఖరీదైన హైలైటర్స్ వాడే కంటే బుగ్గలపై వాసెలిన్ వంటివి రాస్తే ముఖానికి చాలా మంచిది. ఎక్కువ కాంతి ఉన్న లైట్స్ పడినప్పుడు చర్మం నార్మల్ గా మెరుస్తుంది.

గోరువెచ్చని నీరు: పెదవులు ఎప్పుడూ పొడిబారకుండా ఉండాలంటే, కెమెరా ముందు మీరు మాట్లాడుతున్న వాయిస్ పెద్దగా రావాలంటే మీరు ముందు గోరువెచ్చని నీరును తాగండి.