రాగి పాత్రలో ఉంచిన నీరు తాగితో ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనందరికీ తెలుసు. ఐతే ఈ నీటిని తాగవల్సిన రీతిలో తాగకపోతే ఆరోగ్యానికి బదులు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాగి పాత్రల్లోని నీరు ఏ సమయంలో తాగితే అది దివ్యౌషధంగా పనిచేస్తుందో.. వికటిస్తే కలిగే దుష్ర్పభావాలేమిటో.. ఆ సంగతులు మీకోసం..
రాత్రిళ్లు నిద్రించే సమయంలో రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగితే, తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా ఈ నీటిని హానికరం. ఆయుర్వేదం ప్రకారం.. ఇటువంటి ఆరోగ్యకరమైన నీటిని ఉదయాన్నే పరగడుపున తాగాలి.
రాగి పాత్రలో ఉంచిన నీటిని పరిమిత పరిమాణంలో మాత్రమే త్రాగాలి. రోజుకు 2 లీటర్ల కంటే ఎక్కువ తాగితే, కడుపు నొప్పి, గ్యాస్/అసిడిటీ సమస్యలు తలెత్తవచ్చు.
అవసరమైన స్థాయి కంటే అధికంగా రాగి తీసుకుంటే కాలేయం ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. రాగి పాత్రలో నీరు తాగడం మంచిదే.. ఐతే పరిమిత పరిమాణంలో తాగితేనే ఆరోగ్యం.
మరో ముఖ్య విషయం ఏంటంటే.. రాగి పాత్రలో నీటిని ఉంచినట్లైతే ఆ పాత్రను నేలపై పెట్టకూడదు. చెక్క స్టూల్ లేదా ఇతర వస్తువులపై మాత్రమే ఉంచాలి. ఇలా చేయడం వల్ల రాగి నీటిలోని స్వచ్ఛత అలాగే ఉంటుంది.