Health Care Tips: పరగడుపునే వీటిని తీసుకుంటే ఆ సమస్యలు పరార్‌..

|

Apr 08, 2022 | 7:39 PM

Health Care Tips: అనారోగ్యకరమైన జీవనశైలి, పోషకాహార లేమి వల్ల మధుమేహం, చెడు కొలెస్ట్రాల్‌, హైబీపీ వంటి తీవ్రమైన వ్యాధులు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. వీటికి సరైన సమయంలో చికిత్స తీసుకోవడంతో పాటు కొన్ని సహజ చిట్కాలు పాటించడం ఎంతో మంచిది

1 / 6
తులసి ఆకులు: నోటి దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులు తినాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇందులో ఉన్న ఔషధ గుణాలు దంతాల రక్తస్రావం తగ్గిస్తాయి. అదేవిధంగా నోటిని తాజాగా ఉంచుతాయి.

2 / 6
కరివేపాకు: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి వారు కరివేపాకును రోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరంలో కొవ్వు కరిగిపోతుంది.

3 / 6
ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే కొన్ని పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలి

4 / 6
వెల్లుల్లి ఆకులు:  భారతదేశంలో చాప కింద నీరులా వ్యాపిస్తోన్న వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈక్రమంలో క్యాన్సర్ నుంచి రక్షణ పొందాలంటే వెల్లుల్లి ఆకులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులోని ఔషధ గుణాలు పెద్దప్రేగు క్యాన్సర్, చర్మ క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

5 / 6
జిన్సెంగ్ ఆకులు: ప్రస్తుతం చాలామంది మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారు జిన్సెంగ్‌ ఆకులు తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

6 / 6
వేప ఆకులు: మధుమేహ వ్యాధిగ్రస్తులు వేప ఆకులను తీసుకోవడం మంచిది. వేపలో ఉండే గుణాలు, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్లు మాత్రమే కాకుండా సాధారణ వ్యక్తులు కూడా రోజూ 4 నుండి 5 వేప ఆకులను  తీసుకోవాలి.