
శని గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకోవడం వలన ఏప్రిల్ 28 నుంచి ఈ మూడు రాశుల వారు, మేష రాశి, వృషభ రాశి వారికి అదృష్టం పట్టనుంది. కాగా, అసలు ఆ రాశులకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి వారికి శని గ్రహం తన రాశిని మార్చుకోవడం వలన అనేక మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరి సొంతం అవుతుంది ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.

వృషభ రాశి వారికి శని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి మారడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా మీకు బాగుంటుంది. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. బంగారం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

సింహ రాశి వారికి శని నక్షత్రం మారడం వలన చాలా కలిసి వస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి వారికి ఇది మంచి సమయం. ఏ పనిలోనైనా విజయం వీరిసొంతం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. విద్యార్థులు మంచి ర్యాంక్‌లతో విజయం సాధిస్తారు.

ధనలాభం ఉంది. ఈ రాశి వారు ప్రయాణాలు చేయడానికి ముందు తమ ఇష్టదైవం లేదా కుల దైవాన్ని ప్రార్థించుకోవడం చాలా ముంఖ్యం. ఎందుకంటే దాని వలన వీరికి మరింత కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.