
వృషభ రాశి : ఈ రాశి వారికి భాస్కర యోగం వలన జూన్ మొదటి వారం అద్భుతంగా ఉండబోతుంది. అంతే కాకుండా ఈ రాశుల సంపద కూడా పెరుగుతుందంట. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీరు ఎందులో పెట్టుబడి పెట్టినా మీకు మంచి రాబడి రావడం ఖాయం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా ఆనందంగా గడుపుతారు.

వృషభ రాశి : అలాగే ఏ పని చేసినా విజయం వీరిని వరిస్తుందంట. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు జాబ్ కొడుతారు.

సింహ రాశి : బుధుడు, సూర్యుడు 12వ స్థానంలో సంచారం చేయడం వలన భాస్కర యోగం ఏర్పడుతుంది. దీని వలన సింహ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. సంపద రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. కొత్త వరనరుల నుంచి డబ్బు సంపాదిస్తారు.

తుల రాశి : భాస్కర యోగం వలన జూన్ మొదటి వారంలో తుల రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. వీరి ఆస్తులు పెరుగుతాయి. ఉద్యోగం చేసేవారు మీ పై ఉన్నవారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

Bhas3