Post Office Scheme: పోస్టాఫీసుల్లో మంచి రాబడిని అందించే ఈ మూడు పథకాల గురించి తెలుసా?

|

Nov 29, 2022 | 5:53 PM

పోస్టల్‌ శాఖలో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల వలె పోస్టాఫీసుల్లోనూ వివిధ రకాల పథకాలలో మంచి రాబడులును పొందవచ్చు. ఖాతాదారులకు పొదుపు పథకాలను ..

1 / 5
పోస్టల్‌ శాఖలో రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. బ్యాంకుల వలె పోస్టాఫీసుల్లోనూ వివిధ రకాల పథకాలలో మంచి రాబడులును పొందవచ్చు.  మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, సుకర్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌ తదితర పథకాలలో కూడా ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పోస్టల్‌ శాఖలో అందిస్తున్న ముఖ్యమైన పథకాల గురించి తెలుసుకోండి.

2 / 5
రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌: మీరు బ్యాంకుల్లో ఎఫ్‌డి లేదా ఆర్‌డి స్కీమ్‌లో చేరినట్లయితే పోస్టాఫీసుకు సంబంధించిన చిన్న పొదుపు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాలలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా (పీపీఎఫ్‌) సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఉన్నాయి. బ్యాంకుల ఎఫ్‌డీలు, ఆర్డీలు పోస్టాఫీసు పొదుపు పథకం ఇచ్చినంత రాబడిని ఇవ్వవు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచడం వల్ల ఎఫ్‌డిలు, ఆర్‌డిలపై వడ్డీ పెరిగి ఉండవచ్చు.

3 / 5
సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీమ్‌: సీనియర్ సిటిజన్లకు పొదుపు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు వారు ముందుగా పోస్టాఫీసులో అమలు చేసే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌ను ఆశ్రయిస్తారు. ప్రస్తుతం ఈ పథకం వినియోగదారులకు 7.4 శాతం రాబడి పొందవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ ప్రతి త్రైమాసికంలో చెల్లించబడుతుంది. ఎవరైనా సీనియర్ సిటిజన్ ఒంటరిగా లేదా అతని భార్యతో ఈ పథకం ఖాతాను సులభంగా తెరవవచ్చు. కనిష్టంగా రూ.1000, గరిష్టంగా రూ.15 లక్షల డిపాజిట్‌తో ఖాతాను తెరవవచ్చు. ఇందులో పెట్టుబడిపై ఎలాంటి పన్ను లేదు.

4 / 5
పీపీఎఫ్‌ అకౌంట్‌: పోస్ట్ ఆఫీస్‌లోనే నిర్వహించబడే తదుపరి ఖాతా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా. దీనిని పీపీఎఫ్‌ అకౌంట్‌ అని కూడా అంటారు. ఇది కూడా చిన్న పొదుపు పథకం. పొదుపుపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలనుకునే వారు ఈ పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను ఆదా పరంగా, ఈ పథకం ఈఈఈ కేటగిరీ కిందకు వస్తుంది. అంటే పెట్టుబడులు, డిపాజిట్లు, రాబడులపై పన్ను మినహాయింపు ఇస్తారు. మీరు ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ మొదలైన పెద్ద బ్యాంకుల ఎఫ్‌డి పథకాలను పరిశీలిస్తే, పోస్టాఫీసు పిపిఎఫ్ వాటితో పోలిస్తే మెరుగైన రాబడి పొందవచ్చు. ప్రస్తుతం దీనికి 7.1 శాతం వడ్డీ లభిస్తోంది.

5 / 5
సుకన్య సమృద్ధి యోజన: మరో స్కీమ్‌ సుకన్య సమృద్ధి యోజన. చిన్న పొదుపు పథకాలలో ఈ పథకానికి చాలా మంచి పేరుంది. తమ కూతురి పేరు మీద చదువుకు, పెళ్లికి డబ్బు చేర్చాలనుకునే వారు సుకన్య సమృద్ధి ఖాతా తెరవవచ్చు. ప్రస్తుతం సుకన్య సమృద్ధి ఖాతాపై 7.6 శాతం వడ్డీ అందుబాటులో ఉంది. ఈ వడ్డీ రేటు ఏదైనా పెద్ద బ్యాంకు FD కంటే ఎక్కువ. ఈ పథకం ఖాతాను 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కుమార్తె పేరు మీద తెరవవచ్చు. ఈ ఖాతాలో కనిష్టంగా రూ.250. ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేయవచ్చు. ఈ ఖాతాలో పెట్టుబడి పెట్టిన డబ్బుపై ఎలాంటి పన్ను ఉండదు. కుమార్తెకు 18 ఏళ్లు వచ్చే వరకు ఖాతాని తల్లిదండ్రులు లేదా సంరక్షకులు నిర్వహించాల్సి ఉంటుంది.