
మీరు నవ్వినప్పుడు, పరిగెత్తినప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం లీక్ అవుతుందా.. దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఇది సమస్యకు ఆరంభం మాత్రమే. ఏదైనా పనులు చేసినప్పుడు మహిళల్లో అప్పుడు మూత్రం అనేది లీక్ అవుతుంది. ఈ విషయం బయటకు చెప్పలేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మూత్రం ఆపుకోలేని పరిస్థితిని (యూఐ) అంటారు.

మూత్ర సంబంధిత సమస్యలు ఉంటే ఇలా అవుతుంది. ఈ సమస్యలు పురుషుల్లో కూడా కనిపిస్తుంది. కానీ ఎక్కువగా మహిళలకే వస్తుంది. ప్రతి ముగ్గురి మహిళల్లో ఒకరికి యూరిన్ లీకేజీ సమస్యలు ఉన్నాయి. మరి ఈ వ్యాధికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వృద్ధాప్య మహిళల్లో యూఐ సమస్య సర్వ సాధారణంగా ఉంటుంది. 30-35 ఏళ్ల తర్వాత మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. పీరియడ్స్ సమయంలో, కొన్ని సార్లు వయస్సు పెరగడం వల్ల మహిళల కటి కండరాలు బలహీన పడతాయి. దీని వల్ల కూడా మూత్రం లీక్ అవుతుంది.

కొంత మంది మహిళల్లో దీర్ఘకాలిక అనారోగ్యం, సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల శారీరక బలహీనత కూడా మూత్రం లీక్ అవ్వడానికి కారణం అవ్వొచ్చు. అదే విధంగా మహిళల్లో పెరుగుతున్న ఊబకాయం, డయాబెటీస్ కారణం వల్ల కూడా యూరిన్ లీక్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రసవం తర్వాత కూడా మహిళల్లో కూడా కటి కండరాలు వీక్ అయి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. బిడ్డకు జన్మనివ్వడం వల్ల కింద కటి కండరాలు సాగుతాయి. దీంతో వాటిపై ఒత్తిడి పెరిగి.. వారిని బలహీన పరుస్తుంది.