
అతి వినయం : కొంత మంది ప్రతి విషయానికి అవును అని చెప్తుంటారు. కానీ ఇలా చెప్పడం అస్సలే మంచిది కాదంట. దీని వలన మానసిక, భావోద్వేగ శక్తి తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు. మీరు ప్రతి విషయానికి ఇతరులను నిరాశపరుస్తామనే భయంతో అవును అని చెప్పడం అనేది కొత్త అవకాశాలను కోల్పోతామనే భయం నుంచి వస్తుంది. అందువలన మీరు 2026లో ఆనందంగా , ధైర్యంగా ఉండాలి అనుకుంటే మీ పరిమితులను మీరు గౌరవించి, కాదు అని చెప్పడం కూడా నేర్చుకోవాలంట. ఇదే మీకు గౌరవాన్ని, శక్తిని తీసుకొస్తుంది.

గత తప్పులను గుర్తుంచుకోవడం : గత సంవత్సరంలో మీరు చేసిన తప్పు ఒప్పులను గుర్తు పెట్టుకొని, నూతన సంవత్సరానికి సిద్ధం కావాలి. గతంలో చేసిన తప్పులతో విచారంలోకి వెళ్లడం వలన ఈ సంవత్సరంలో మీరు పురోగతి సాధించలేరు. కాట్టి, గతంలో చేసిన తప్పులు, వదులుకున్న అవకాశాల గురించి వదిలేసి, కొత్త సంవత్సరంలో సాధించే వాటి గురించి ఆలోచించాలంట.

ఆర్థిక బాధ్యత : చాలా మంది ఆర్థిక పరమైన సమస్యల వలన ఒత్తిడికి గురి అవుతుంటారు. బడ్జెట్ కోసం సరైన ప్రణాళిక వేసుకోవడం, పొదుపు చేయడం వంటి అలవాట్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే 2026లో మాత్రం డబ్బు గురించి సరైన అవగాహన కలిగి ఉండి, ప్రనాళిక ప్రకారం ముందుకు వెళ్లండి. దీని వలన మీరు ఆర్థికంగా బలంగా ఉండగలుగుతారు. ఇది మీకు మనోధైర్యాన్ని ఇస్తుంది.

ఫోన్ వాడకం తగ్గించడం : ఈ డిజిటల్ యుగంలో చాలా మంది ఎక్కువగా ఫోన్‌కు అడెక్ట్ అయిపోయి, సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. ఎక్కువగా రీల్స్ చూస్తూ, ఆన్ లైన్ గేమ్స్, వాట్సాప్ చాట్స్, స్నాప్‌లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఈ అలవాటు, ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతుంది. అనారోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. అందువలన 2026లోకి అడుగు పెట్టే ముందు స్క్రీన్ సమయానికి ఒక టైమ్ అనేది కేటాయించుకోండి. ఇది మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

ఒకరితో పోల్చుకోవడం : చాలా మంది తమను మరొకరితో పోల్చుకుంటుంటారు. వజయం, ఆనందం, ఇలా ఏ విషయంలోనై సరే ఇతరులతో పోల్చొని బాధపడుతుంటారు. అయితే ఇలా పోల్చుకోవడం వలన మీ విలువ అనేద తగ్గిపోతుంది. అంతే కాకుండా ఇది అనవసరమైన ఒత్తిడి, అసంతృప్తికి కారణం అవుతుంది. అందుకే 2026లోకి అడుగు పెట్టే సమయంలో పోల్చుకోవడం వదిలేసి, మీ సొంత పురోగతిపై దృష్టి పెట్టడం చేయాలంట. దీని వలన మీరు మంచి పొజిషన్ లో ఉంటారు.