
నోటి క్యాన్సర్ అనేది ఎక్కువగా పొగాకు, పాన్ , గుట్కా నమలడం వలన వస్తుంద ముఖ్యంగా ధూమపానం, పొగాకు నమలడం వలన ఈ ప్రమాదం ఎక్కువ పెరుగుతుందంట. దాదాపు భారత దేశంలో 60 శాతం కంటే ఎక్కువ క్యాన్సర్ కేసులు మద్యం, పొగాకుతో ముడిపడి ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెళ్లడి అయ్యింది.

62 శాతానికి పైగా, నోటి క్యాన్సర్లు, పొగాకు, ఆల్కహాల్ వాడకం వలన సంభవిస్తున్నాయంట. ముఖ్యంగా మద్యం నోటి క్యాన్సర్ ప్రమాదాన్ని విపరీతంగా పెంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆల్కహాల్ నోటి కణాలలోని డీఎన్‌ఏ దెబ్బతీసే అసిటాల్డిహైడ్ అనే టాకసిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కణాలను దెబ్బతీసి , క్యాన్సర్ ప్రభావాన్ని పెంచుతుందంట. అందుకే వీలైనంత వరకు మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు వైద్యులు.

క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు :నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు చిన్న పుండులా ప్రారంభం అవుతుందంట. మొదట పెదవి చిగుళ్లలో చిన్న పుండు ఏర్పడటం ఇది అలాగే కొనసాగుతూ, నాలుక, బుగ్గల లోపలికి వ్యాపిస్తుందంట. కొన్ని సార్లు దవడ భాగంలో పుండులా ఏర్పడుతుందంట.

అదే విధంగా నాలుక , చిగుళ్ల లేదా నోటి పొరపై తెల్లటి, ఎరుపు రంగు మచ్చలు కూడా నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ మచ్చలు రెండు వారాల కంటే ఎక్కువ రోజులు ఉన్నట్లు అయితే ఇది నోటి క్యాన్సర్ అన్నట్లే, ఇలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా వైద్యులను సంప్రదించాలని తగు పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.