
టైఫాయిడ్ వర్షకాలంలో టైఫాయిడ్ ఫీవర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఈ సీజన్‌లో కలుషితమైన నీరు, సాల్మొనెల్ల టైఫీ బ్యాక్టీరియా వలన ఈ విష జ్వరం వస్తుంది. కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు ద్వారా ఈ బ్యాక్టీరియా అనేది వేగంగా వ్యాపిస్తుందంట. టైఫాయిడ్ వస్తే విపరీతమైన జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి.కొన్ని సార్లు ఇది ప్రాణానికి కూడా ముప్పు తీసుకొస్తుంది. అందుకే ఈ సీజన్‌లో ఆరోగ్యం పట్ల అస్సలే ఆశ్రద్ధ చేయకూడదంట.

కలరా , విరేచనాలు : కలరా వ్యాధి అనేది కలుషితమైన నీరు, అపరిశుభ్రమైన ప్రదేశాల వలన త్వరగా వ్యాప్తిచెందుతుంది. ముఖ్యంగా వర్షకాలంలో చాలా మంది దీని బారినపడుతుంటారు. అందుకే కలరా, విరేచనాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

లెప్టోస్పిరోసిస్ :ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ముఖ్యంగా ఎలుకల మూత్రం ద్వారా కలుషితమైన నీటి ద్వారా వ్యాపిస్తుంది. భారీ వర్షపాతం, నీరు నిలిచిపోవడంతో బ్యాక్టీరియా ఫామై ఈ వ్యాధి వ్యాపిస్తుంటుంది. దీని వలన జ్వరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తుంటాయి.

డెంగ్యూ, మలేరియా :వర్షకాలంలో వచ్చే అంటు వ్యాధుల్లో డెంగ్యూ, మలేరియా కూడా ఒకటి. ఇవి నీరు నిలిచి ఉండటం, అపరిశుభ్రమైన వాతావరణం, దోమలు, కలుషిత ఆహారంం తినడం వలన వస్తాయి. చాలా వరకు వర్షకాలం ప్రారంభైన కొన్ని రోజుల్లోనే ఈ కేసులు విపరీతంగా పెరిగిపోతుంటాయి. దీని లక్షణాలు చూస్తే మొదట చలి జ్వరంతో చిన్నగా మొదలై, తీవ్రంగా జ్వరం వస్తుంటుంది. తలనొప్పి, బలహీనత, అలసట ఏర్పడుతాయి.

చికున్‌గున్యా :వర్షకాలంలో వచ్చే వ్యాధుల్లో చికున్ గున్యా ఒకటి. ఇది అపరిశుభ్రత వాతావరణం, కలుషిత ఆహారం వలన వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో కాళ్లు ఉబ్బడం, కాళ్ల నొప్పులు, విపరీతమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాకుండా ఇది దోమ ద్వారా వ్యాపిస్తుంది. కొన్ని సార్లు ఈ వ్యాధి వచ్చిన వారు దీర్ఘకాలికంగా కూడా ఈ సమస్యలు ఎదర్కొనే అవకాశం ఉంటుందంట.