
అతి కోపం,మొండితనం : భార్య భర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నం కావడానికి కోపం, మొడితనం ఒక కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. భార్య లేదా భర్త తమ మనసులోని మాటను చెప్పలేక లోపల కోపం ప్రదర్శిస్తూ, మొండితనంగా వ్యవహరించడం ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుందంట. అలాగే ఒక వ్యక్తి తన భాగస్వామిని పట్టించుకోకుండా, మొడిగా వ్యవహరించడం వలన కూడా బంధంలో చీలిక తీసుకొస్తుంది. అందుకే కోపాన్ని వ్యక్తపరచాలి, భార్య భర్తల మధ్య మొండితనం అస్సలే పనికి రాదు అంటున్నారు నిపుణులు.

సోషల్ మీడియా ఎఫెక్ట్ : ఈ రోజుల్లో చాలా మంది సోషల్ మీడియాకే అంకితం అవుతున్నారు. కొత్తగా పెళ్లైన తర్వాత కూడా భార్య కంటే తన మొబైల్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్య సంభాషణ తగ్గిపోయి, ప్రేమ కూడా తగ్గిపోతుంది. దీంతో ఇది వివాహ బంధం విచ్ఛిన్నం అయ్యేలా చేస్తుంది. అందుకే మొబైల్ ఫోన్ కంటే తమ భాగస్వామికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడమే కాకుండా రోజులో కాసేపు తనతో మనసు విప్పిమాట్లాడటం, తన కాసేపు ఆనందంగా గడపడం వలన బంధంలో చీలికరలు రావంట.

భాగస్వామిని విమర్శించడం : పోలిక అనేది మంచిది కాదు. మీరు మీ భార్యను పదే పదే ఇతరులతో పోల్చడం, వారిని విమర్శించడం ఎగతాళి చేసి మాట్లాడటం, ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడటం వలన మీ భాగస్వామికి మీపై ఉన్న ప్రేమ, నమ్మకం పూర్తిగా తగ్గిపోతుందంట. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగి, ఇది విడాకులకు కారణం అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

పోలిక : ఎప్పుడూ కూడా మీ భాగస్వామిని ఇతరులతో పోల్చకూడదు. ఎందుకంటే ఇది చాలా తప్పు అంటున్నారు నిపుణులు. దీని వలన బంధం బలహీనపడుతుందంట. అందుకే ఎప్పుడూ కూడా మీ భాగస్వామిని ఇతరులతో పోల్చకుండా,ప్రతి విషయంలోనూ తమకు సపోర్ట్ చేస్తూ సాగిపోవాలంట. దీని వలన ఇద్దరి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు ఏర్పడవు, బంధం బలంగా ఉంటుంది.

భాగస్వామి మనసు అర్థం చేసుకోకపోవడం : కొంత మంది తమ భాగస్వామి మనసు అర్థం చేసుకోకుండా మాటలతో బాధపెడుతారు. అయితే ఇది అస్సలే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. వారికి ఆర్థిక భద్రత ఇవ్వడమే కాదు, వారి భావాలను అర్థం చేసుకొని, వారికి కాస్త సమయం కేటాయించి, వారిలో ఉన్న బాధను తొలిగించాలంట. దీని వలన ఇద్దరి మధ్య బంధం బాగుంటుంది.