Yoga Poses: శరీరాకృతితోపాటు చర్మ సౌందర్యాన్ని పెంపొందించే యోగాసనాలు.. ఎలా వేయాలంటే..

|

Feb 24, 2022 | 9:51 AM

యోగా సాధన చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో ప్రాచీన కాలం నుంచే యోగా ప్రాచుర్యంలో ఉంది. శరీరం నుంచి హానికరమైన మలినాలను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో యోగాసనాలు..

1 / 6
yoga for face glow: యోగా సాధన చేయడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా మన దేశంలో ప్రాచీన కాలం నుంచే యోగా ప్రాచుర్యంలో ఉంది. శరీరం నుంచి హానికరమైన మలినాలను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో యోగాసనాలు కీలకంగా వ్యవహారిస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఉపయోగపడతాయి. శారీరక రుగ్మతలు, చర్మ సమస్యలను దూరం చేయడంలోనూ యోగాసనాలు సహాయపడతాయి. ఈ కింద సూచించిన కొన్ని ఆసనాలు శరీరాకృతితోపాటు, ఆరోగ్యాన్ని అందిస్తాయి. అవి ఎలా వేయాలో చూద్దాం..

2 / 6
బాలసనం: మోకాళ్లను వంచి నేలపై ఉంచాలి. తుంటిని మీ పాదాలపై ఉంచి, క్రిందికి వంచాలి. తలను నేలపై ఆనించాలి. ఛాతీ భాగం తొడపై ఉండాలి. ఇప్పుడు రెండు చేతులను తల ముందు నిటారుగా ఉంచాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్లపాటు ఉండి, ఆపై విడుదల రిలాక్స్‌ అవ్వాలి.

3 / 6
హలాసనం: నిటారుగా పడుకుని ఈ ఆసనాన్ని వేయాలి. అరచేతులను నేలకి ఆనించి, కాళ్ళను నెమ్మదిగా పైకి లేపి తల వెనుకకు వంచాలి. అంటే కాళ్ళు మీ తల వెనుక ఉండాలన్నమాట. చేతులతో వెనుకకు వంచడానికి ఉపయోగించవచ్చు. ఈ భంగిమలో కొన్ని సెకన్లపాటు ఉండి, ఆపై విడుదల రిలాక్స్‌ అవ్వాలి.

4 / 6
సర్వంగాసనం:  నిటురుగా పడుకుని, పాదాలను నెమ్మదిగా నేల నుంచి ఎత్తడం ప్రారంభించాలి. తర్వాత పెల్విక్‌ను కూడా పైకి ఎత్తి, సపోర్టుగా చేతులను వెనుకభాగంలో ఉంచాలి. ఈ ఆసనం చేసేటప్పుడు పాదాలపై ఏకాగ్రత ఉంచాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్లపాటు ఉండి, ఆపై విడుదల రిలాక్స్‌ అవ్వాలి.

5 / 6
చక్రాసనం: నిటురుగా పడుకుని, పాదాలను నెలపై మోపి, మోకాళ్ల వద్ద వంచి, చేతులను భుజాల దగ్గరికి తీసుకుని అరచేతులను నేలపై ఆనించాలి. వెనుకనుంచి చేతులను పాదాల దిశగా కదిలించి, తల నేలపై ఉంచి శరీరాన్ని పైకి ఎత్తాలి. తర్వాత తలను పైకి లేపాలి. కాళ్లు, చేతులు, నడుము సాగినట్లు అనిపించేలా తలను పూర్తిగా పైకి లేపాలి. శరీరం చక్రం భంగిమలో ఉంచాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్లపాటు ఉండి, ఆపై విడుదల రిలాక్స్‌ అవ్వాలి. ఈ విధంగా ఆసనాన్ని రెండుసార్లు రిపీట్ చేయ్యాలి.

6 / 6
వృక్షాసనం: నిటారుగా నిలబడి, కాళ్ళను ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. గట్టిగా ఊపిరి తీసుకని, పాదాలలో ఒక దానిని రెండవ మోకాళిపై నిటారుగా ఉంచాలి. శరీర బరువును రెండు పాదాల అరికాళ్లపై ఉంచాలి. చేతులు పైకి చాచి నమస్కారం భంగిమలో ఉంచాలి. ఈ భంగిమలో కొన్ని సెకన్లపాటు ఉండి, ఆపై విడుదల రిలాక్స్‌ అవ్వాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేస్తే, వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.