Side Effects of Turmeric Milk: ఈ 5 సమస్యలున్న వారు ఎప్పుడూ పసుపు పాలు తాగొద్దు.. తాగారో అంతే సంగతలు..

|

Aug 17, 2021 | 3:53 PM

Side Effects of Turmeric Milk: మనిషి ఆరోగ్యానికి పసుపు పాలు చాలా ప్రయోజనకరం. కరోనా కాలంలో ఇది రోగనిరోధక శక్తిని పెంచి.. మహమ్మారిని అడ్డుకుంటోంది. అయితే, కొంతమంది మాత్రం పసుపు పాలు తాగడం మానుకోవాలి. లేదంటే లేని సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది.

1 / 5
కాలేయానికి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్న వారు నిపుణుల సలహా లేకుండా పసుపు పాలను ఎప్పుడూ తాగకూడదు. అలాంటి వారికి.. పసుపు పాలు సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. వారి సమస్యను మరింత తీవ్రతరం చేసే ప్రమాదం ఉంది.

2 / 5
రక్తహీనత ఉన్నవారు కూడా పసుపు పాలు తాగకూడదు. శరీరంలోకి వెళ్లిన పసుపు పాలు.. రక్తంలోని ఐరన్‌ మూలకాలను గ్రహిస్తుంది. తద్వారా శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుంది. దాంతో.. రక్తహీనత సమస్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

3 / 5
గర్భిణీ స్త్రీలు పసుపు పాలు తాగకూడదు. పసుపు పాలు ఉదరంలో వేడిని పెంచుతాయి. ఫలితంగా గర్భాశయంలో పిసుకుతున్నట్లుగా, రక్తస్రావం, తిమ్మిర్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి మూడు, నాలుగు నెలలు గర్భదారణ సమయంలో పసుపు పాలు తాగడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది. అందుకే గర్భిణీ స్త్రీలు పసుపు పాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

4 / 5
కొంతమందిలో వేడి తీవ్రత అధికంగా ఉంటుంది. విశ్రాంతి లేకపోవడం, భయపడటం, మొటిమలు, దురద, అలర్జీ వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారి శరీరం వేడి స్థితిని తట్టుకోలేదు. శరీర ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న వారు పసుపు పాలు తాగకూడదు. ఒకవేళ తాగినట్లయితే.. వారి శరీరంలో మరింత వేడి పెరుగుతుంది. ఇతర సమస్యలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

5 / 5
మీకు పిత్తాశయానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే లేదా పిత్తాశయంలో రాయి ఉంటే మీరు పసుపు పాలు తాగకూడదు. ఇది మీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.